ప్రభాస్ ని బీట్ చేసే ఏకైక టాలీవుడ్ హీరో అతడే?

Purushottham Vinay
ప్రభాస్ ని బీట్ చేసే ఏకైక టాలీవుడ్ హీరో అతడే? 

ప్రస్తుతం కల్కి సినిమాకి వరల్డ్ వైడ్ సాలిడ్ కలెక్షన్స్ వస్తున్నాయి. 5 రోజుల్లో ఏకంగా రూ. 590 కోట్లకు పైగా వచ్చేసాయి. కల్కి కథను సిల్వర్ స్క్రీన్ పై గొప్పగా ఆవిష్కరించాడు నాగ్ అశ్విన్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనె, కమల్ హాసన్ పాత్రలను ఆయన తీర్చిదిద్దిన తీరు చాలా గొప్పగా ఉంది. యూఎస్ లో కల్కి సినిమా వసూళ్లు ఏకంగా $11 మిలియన్ వసూళ్లని దాటేసాయి. హిందీలో కూడా ఇప్పటికీ కల్కి సినిమా వసూళ్లు రూ. 120 కోట్లకి పైగా నెట్ వసూళ్లని దాటేశాయి.ఈ వారం కూడా నిలకడగా వసూళ్లు రాబడితే ఖచ్చితంగా 1000 కోట్ల మార్క్ దాటే అవకాశం ఉంటుంది.  


అయితే బాహుబలి 2 రికార్డుల విషయంలో ఇండియాలో స్టార్ హీరోస్ ఎవ్వరూ కూడా ప్రభాస్ దారిదాపుల్లో కూడా లేరు. అమీర్ ఖాన్ దంగల్ తో బాహుబలి 2 ని బీట్ చేశాడు కానీ.. ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం బాహుబలి 2 నే నెంబర్ 1 గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, షారుఖ్ ఖాన్ లు కూడా తమ పాన్ ఇండియా సినిమాలతో బాహుబలి 2 రికార్డులని బ్రేక్ చేయలేకపోయారు. ఇక ప్రభాస్ బాహుబలి 2 రికార్డులు బ్రేక్ అవ్వాలంటే ప్రస్తుతం ఒకే ఒక్క హీరో వల్ల అవుతుంది. అతనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. ఎందుకంటే మహేష్ బాబు ఆ బాహుబలి 2 ని తెరకెక్కించిన రాజమౌళితో నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు. 

మహేష్ ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా టాలీవుడ్ నుంచి ఏ రికార్డ్ చూసుకున్న ఖచ్చితంగా టాప్ 5 లో ఉంటాడు. అది కూడా కేవలం రీజనల్ సినిమాలతోనే. అవి కూడా యావరేజ్ హిట్ సినిమాలే. అలాంటి యావరేజ్ సినిమాలతోనే రికార్డులు సృష్టించే మహేష్ పాన్ ఇండియా సినిమా.. అది కూడా రాజమౌళితో చేస్తే ఎలా ఉంటుంది.. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ షేక్ అవుతుంది.. సో ప్రస్తుతం మహేష్ ఒక్కడే ప్రభాస్ బాహుబలి 2 సినిమా రికార్డులని బద్దలు కొట్టగలడు. మరి చూడాలి రాజమౌళితో చేసే సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్దో...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: