తెలుగుదేశానికి ఇవాళ్టి నుంచే కొత్త అధ్యక్షుడు?

Chakravarthi Kalyan
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవాళ పల్లా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో  మధ్యాహ్నం 1.45కు బాధ్యతలు పల్లా శ్రీనివాస్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ను ఇటీవలే చంద్రబాబు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.


విశాఖ జిల్లాకు చెందిన పల్లా శ్రీనివాస్.. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికంగా 95,235 ఓట్ల మెజార్టీతో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై  విజయం సాధించారు. ఏపీ.. విభజన తర్వాత తెలుగు దేశం రెండు రాష్ట్రాలకు అధ్యక్షులను నియమించే సాంప్రదాయం ప్రారంభించింది. ఈ దిశలో మొదటగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు పని చేశారు. ఆ తర్వాత ఆ అవకాశం చంద్రబాబు అచ్చెన్నాయుడికి ఇచ్చారు. అచ్చెన్నాయుడు తర్వాత ఇప్పుడు ఆ అవకాశం పల్లా శ్రీనివాస్‌కు దక్కింది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: