బిగ్ బ్రేకింగ్ : బాలకృష్ణ ఇంటికి అల్లు అరవింద్ .. అందుకోసమేనా..?
అయితే ఇదే క్రమంలో నందమూరి బాలకృష్ణ ద్వారా రేవంత్ రెడ్డి తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట అల్లు అరవింద్ .. రేవంత్ రెడ్డి అలాగే బాలకృష్ణకు మధ్య మంచి స్నేహం ఉంది .. గతంలో తెలుగుదేశం పార్టీలో రేవంత్ రెడ్డి ఉన్న సమయంలో బాలకృష్ణతో ఎంతో సన్నిహితంగా ఉండేవారు.. అలాగే బాలయ్య నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో కూడా అప్పట్లో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు .. ఇప్పుడు ఎలాగైనా రేవంత్ రెడ్డిని కూల్ చేసేందుకు బాలకృష్ణ ద్వారా వెళ్లాలని ప్రయత్నాలు మొదలు పెట్టారట అల్లు అరవింద్. చిత్ర పరిశ్రమ రేవంత్ రెడ్డి అనుకోని నిర్ణయంతో మరిన్ని ఇబ్బందుల్లో పడి అవకాశం కూడా ఉండటం తన కొడుకు సినిమా భవిష్యత్తు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉండటంతో అల్లు అరవింద్ జాగ్రత్తలు పడుతున్నాడు .
ఇప్పటికే పబ్లిక్ లో అల్లు అర్జున్ దోషగా చూడటం మొదలుపెట్టారు .. దీంతో ఈ వ్యవహరం నుంచి ఎలాగైనా బయటకు రావాలని ఎన్నో కష్టాలు పడుతున్నారు అల్లు అరవింద్. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఎక్కడ వెనకొడుకు వేసి అవకాశం లేకపోవడంతో తర్వాత ఏం చేయాలని దానిపై అటు చిరంజీవితో కూడా చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చిరంజీవి కూడా ఇప్పటికే గత శనివారం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంపై కాస్త అసహనం వ్యక్తం చేశారట .. మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ బాడీ లాంగ్వేజ్ పై చిరంజీవి అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది .. గవర్నమెంట్ కి క్షమాపణ చెప్పకుండా అనవసరంగా సమస్యను మరింత పెంచే విధంగా అల్లు అర్జున్ మాట్లాడాలని కూడా చిరంజీవి కామెంట్ చేసినట్టు తెలుస్తుంది . అయితే ఈ విషయంలో అల్లు అరవింద్ కు ఎవరు సపోర్టుగా ఉంటారనేది తెలియాల్సి ఉంది ..