"కూటమి" లో క్రెడిట్ ఎవరికి? నీదా.. నాదా.. అనుకునే టైమ్ వచ్చింది

frame "కూటమి" లో క్రెడిట్ ఎవరికి? నీదా.. నాదా.. అనుకునే టైమ్ వచ్చింది

Pandrala Sravanthi
 ఏపీ లో  "యుద్ధం నీదా నాదా హై"  అంటూ వైసీపీ టీడీపీ కూటమి మధ్య పోరు ఏర్పడింది.  అంతే కాదు వైసిపి నాయకులు యుద్ధం లో మేమే గెలుస్తామని తొడలు కొట్టి మరి చెప్పారు.  జగన్మోహన్ రెడ్డి కూడా తన గెలుపు పై ఎన్నో అశలు పెట్టుకున్నారు. తన పథకాలే తనకు అండగా నిలుస్తాయని భావించినటు వంటి జగన్మోహన్ రెడ్డి కి ప్రజలంతా మొండి చేయి చూపించారు.  కూటమి ముందు వైసిపి ఫ్యాన్  తిరగకుండా చేశారని చెప్పవచ్చు. అలాంటి ఈ తరుణం లో   మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 132 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి కూటమి దూసుకుపోతోంది. 

అలాగే జనసేన అభ్యర్థులు 19 స్థానాల్లో,  బిజెపి ఏడు స్థానాల్లో ముందున్నారు. ఫ్యాన్ పార్టీకి చెందిన అభ్యర్థులు కేవలం 17 స్థానాల్లో మాత్రమే దూసుకుపోతున్నారు.  పార్లమెంటు విషయానికి వస్తే .. 25 పార్లమెంటు స్థానాల్లో సైకిల్ పార్టీ 15, జనసేన రెండు, బిజెపి మూడు,  వైసిపి ఐదు స్థానాల్లో లీడింగ్ లో ఉంది. ఈ విధంగా ఎక్కడ చూసినా కూటమి అభ్యర్థుల హవానే నడుస్తోంది.  ఇదే తరుణంలో కూటమి లో క్రెడిట్ నీదా నాదా అనే లెక్కలు కూడా వేసుకునే పరిస్థితి వచ్చింది. టిడిపి కూటమి గెలిస్తే ఆ క్రెడిట్ మనం ఎవరికి ఇవ్వాలి  అనే విషయంలోకి వెళ్తే మాత్రం తప్పకుండా పవన్ కళ్యాణ్ నాదే క్రెడిట్ అనుకుంటున్నారట. 

మరోవైపు చంద్రబాబు నాదే అనుకుంటున్నారట. మధ్యలో వచ్చినటువంటి బిజెపి కూడా మా వల్లే ఇంత రిజల్ట్ వచ్చిందని భావిస్తున్నారట.  మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఎవరికి వారే గెలుపు మావల్లె వచ్చిందంటే, మావల్లె వచ్చింది అనుకుంటూ  సంబరపడిపోతున్నారట.అంతేకాకుండా  గెలిచిన తర్వాత ఈ మూడు పార్టీల నుంచి ఉన్నటువంటి ప్రధాన నాయకులకు ఎలాంటి పదవులు వస్తాయనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. మరి చూడాలి కూటమి విజయతీరాలకు  వెళ్లడానికి కారకులు ఎవరు, నిజంగా ఈ క్రెడిట్ ఎవరిదో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: