కోస్తా వెటకారానికి కాస్త ఘాటేక్కువే! వన్ సైడ్ చేసిపడేశారుగా!

Purushottham Vinay
ఆంధ్ర ప్రదేశ్ లో స్పష్టమైన ఆధిక్యం దిశగా ఎన్డీఏ కూటమి చాలా వేగంగా ఎక్కడా ఆగకుండా దూసుకుపోతోంది. ఇప్పటికే మేజిక్ ఫిగర్‌ను కూడా ఈజీగా దాటేసింది. ఇక కొన్ని జిల్లాల్లో అయితే ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్‌ దిశగా చాలా ఫాస్ట్ గా దూసుకెళుతోంది.రాయలసీమ, కోస్తా ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతాలలో టీడీపీ కూటమి స్పష్టమయిన ఆధిక్యం ప్రదర్శిస్తున్నది. జనసేన పార్టీ 9 చోట్ల ఆధిక్యం ప్రదర్శిస్తున్న నేపథ్యంలో టీడీపీ ఓట్లు జనసేన అభ్యర్థులకు పడ్డాయని స్పష్టంగా అర్ధం అవుతున్నది. కోస్తా వెటకారానికి కాస్త ఘాటేక్కువే. వన్ సైడ్ చేసిపడేశారుగా! అసలు కోస్తాంద్రాలో అయితే వార్ వన్ సైడ్ అన్నట్టుగా టీడీపీ స్పీడ్ గా దూసుకుపోతుంది.కృష్ణా, గుంటూరు జిల్లాల్లో టీడీపీ క్లీన్ స్వీప్ చేయనున్నట్టు ప్రస్తుతం వచ్చిన ఫలితాలను బట్టి తెలుస్తోంది. ఇక కర్నూలు జిల్లాలో అయితే ఒక స్థానం తప్పా మిగిలిన అన్ని చోట్లా ఎన్డీఏ కూటమి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. 


ఇక కృష్ణా జిల్లాలో అయితే తొలి రౌండ్ నుంచి కూడా టీడీపీ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఫస్ట్ రౌండ్ నుంచి కూడా కూటమి అభ్యర్థులు ఆధిక్యాన్ని కనబరుస్తున్నారు. మూడు రౌండ్లు ముగిసే సరికి ఏకంగా ఐదువేలపైన అభ్యర్థులు మెజారిటి కొనసాగిస్తున్నారు. ఇప్పటికే కౌంటింగ్ సెంటర్ నుంచి వైసీపీ నేతలు బయటకు వెళ్లిపోవడం జరిగింది. వైసీపీ కీలక నేతలైన కొడాలి నాని, వల్లభనేని వంశీమోహన్ ఇంకా కైలే అనిల్‌లు కౌంటింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్లిపోయిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇక మంత్రుల విషయానికి వస్తే అందరూ ఓటమి బాటలోనే ఉన్నారు. మంత్రులు రోజా, బుగ్గన రాజేంద్రనాథ్, గుడివాడ అమరనాథ్ రెడ్డి, మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి ఓటమి బాటలో ఉన్నారు. కోస్తా ఇంకా రాయలసీమలో ఎన్డీఏ కూటమి హవా చాటుతోంది.గెలుపు వైపు శరవేగంగా టీడీపీ కూటమి దూసుకుపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: