తమిళనాడు : ఓటమి దిశగా బీజేపీ యుద్ధ వీరుడు అన్నామలై ?

Veldandi Saikiran
దక్షిణ భారతదేశంలో బాగా వేయాలని అనుకుంటున్న బిజెపి పార్టీకి ఊహించని షాక్ తగులుతోంది. సౌత్ ఇండియాలో పాగా వేయాలనుకున్న...బిజెపి పార్టీని తమిళ ఓటర్లు రిజెక్ట్ చేశారు. రాష్ట్రంలో మొత్తం 39 ఎంపీ స్థానాలు ఉన్నాయి. అయితే అక్కడ బిజెపి 19 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా లీడింగ్ లో కొనసాగించడం లేదు భారతీయ జనతా పార్టీ.

ముఖ్యంగా తమిళనాడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు,బీజేపీ యుద్ధ వీరుడు అన్నామలై కోయంబత్తూరులో ఓటమి దిశగా వెళుతున్నారు. తమిళనాడు కోయంబత్తూర్‌లో మొదటి రౌండ్‌ నుంచి అన్నామలై వెనుకంజలో ఉన్నారు.  కోయంబత్తూరు లోక్‌సభ స్థానానికి ఫేజ్ 1లో ఏప్రిల్ 19న ఓటింగ్ జరిగింది. 2024 లోక్‌సభ ఎన్నికలలో భాగంగా కోయంబత్తూరు ఎన్నికల బరిలో గణపతి రాజ్‌కుమార్  (డిఎంకె), అన్నామలై కె (బిజెపి), మరియు సింగై జి రామచంద్రన్ (ఎఐఎడిఎంకె) బరిలో ఉన్నారు.  ఇక ఇక్కడ అన్నామలై ఓటమి దిశగా వెళుతున్నారు. ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం, కోయంబత్తూరు స్థానానికి జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడు బిజెపి చీఫ్, పార్టీ ఫైర్‌బ్రాండ్ నాయకుడు కె. అన్నామలై ఓడిపోయే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పుడు అదే జరుగుతోంది. అటు తమిళనాడు రామనాథపురంలో పన్నీర్‌ సెల్వం కూడా వెనుకంజలో ఉన్నారు.
ఇది ఇలా ఉండగా, కేరళలోని వయనాడ్‌లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ లక్ష ఓట్ల ఆధిక్యంతో దూసుకెళుతున్నారు.  అటు ఉత్తర్‌ప్రదేశ్‌ రాయ్‌బరేలీలో 60వేల ఓట్ల ఆధిక్యంలో రాహుల్‌గాంధీ ఉన్నారు. విదిశాలో మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం శివరాజ్‌ సింగ్ చౌహాన్‌కు 2లక్షలకు పైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళుతున్నారను. కర్నాల్‌ నుంచి హరియాణా మాజీ సీఎం మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ ఆధిక్యంలో  ఉన్నారు. కేరళలోని తిరువనంతపురంలో కేంద్రమంత్రి రాజీవ్‌ చంద్రశేఖరన్‌ ఆధిక్యంలో ఉన్నారు.

పంజాబ్‌ ఖాదూర్‌ సాహిబ్‌లో ఖలిస్థానీ వేర్పాటు వాది అమృత్‌పాల్‌ సింగ్‌ 45వేల పైచిలుకు ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. ఒడిశా సంబల్‌పూర్‌లో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ ఆధిక్యంలో ఉన్నారు. మహారాష్ట్ర బారామతిలో సుప్రియా సులే ఆధిక్యంలో ఉన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌ హమీర్‌పూర్‌లో 50వేల ఓట్ల ఆధిక్యంలో అనురాగ్‌ ఠాకూర్‌ ఉన్నారు. వారణాసిలో ప్రధాని నరేంద్రమోదీ మరోసారి ఆధిక్యంలోకి వచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: