ఎడిటోరియల్ : కాబోయే సిఎం జగనేనా ? కొంపముంచే అతి విశ్వాసం

Vijaya

‘మరో మూడు నెలల్లో సిఎం అవుతా’... ఇది తాజాగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్. రేపేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఓడలనుకున్నది బండ్లవుతాయి. బండ్లే ఓడలవుతాయి. పోయిన ఎన్నికల్లో కూడా అందరూ కాబోయే సిఎం జగనే అనుకున్నారు. కానీ ఫలితాలు వచ్చిన తర్వాత జరిగిందేమిటి ? కాబట్టి జగన్ తొందరపడకూడదు. ఆత్మ విశ్వాసం ఉండొచ్చు. కానీ అతి విశ్వాసం అవకాశాలను దెబ్బతీస్తుందన్న విషయం జగన్ గుర్తుపెట్టుకోవాలి.

 

రాబోయే ఎన్నికల్లో  చంద్రబాబును ఓడించటం అనుకుంటున్నంత ఈజీ కాదన్న విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలి. నిజానికి రాజకీయాల్లో జగన్ కన్నా చంద్రబాబు ఆరితేరిపోయారన్న విషయం అందరికీ తెలిసిందే. అధికారాన్ని అందుకోవటానికి జగన్ నేలబారుస్ధాయికి దిగటానికి ఏమాత్రం ఇష్టపడరు. అదే చంద్రబాబైతే దేనికీ మొహమాట పడరు. అధికారం అందుకోవటానికి రేపటి రోజున మళ్ళీ మోడి కాళ్ళు పట్టుకోమన్నా పట్టుకోవటానికి చంద్రబాబు ఏమాత్రం మొహమాటపడరు.

 

చంద్రబాబుకు కావాల్సింది కేవలం అధికారం మాత్రమే. తనను తాను ప్రతిపక్ష నేతగా ఏమాత్రం ఊహించుకోలేరు. అందుకనే గెలవటానికి ఉన్న అవకాశాల్లో ఏ ఒక్కదాన్నీ వదులుకోరు. పైగా అధికారంలో ఉండటం చంద్రబాబుకు అన్నీ రకాలుగాను కలసివస్తుంది. అన్నింటికన్నా అతిపెద్ద బలం మీడియా సపోర్ట్. మొసలికి నీళ్ళల్లో ఎంత బలం ఉంటుందో చంద్రబాబుకు మీడియా బలం అంతటిది. మీడియా సపోర్టు లేకపోతే ఈ పాటికే  చంద్రబాబు బట్టలు చించుకుని తిరుగుతుండాల్సింది.

 

నాలుగేళ్ళల్లో ఇంత భారీ స్ధాయిలో అవినీతికి పాల్పడినా, తప్పుడు నిర్ణయాలు తీసుకుని కూడా చెలాయించగలుగుతున్నాడంటే అదంతే కేవలం మీడియా మద్దతే. కాబట్టి  ఆ విషయాన్ని గుర్తుంచుకుని జగన్ ప్లాన్ చేసుకుంటే మంచిది. చంద్రబాబును అధికారంలో నుండి దింపేయాలని 2003లో లాగ జనాలే అనుకుంటే అది వేరే సంగతి. కానీ అప్పటి పరిస్ధితి ఇపుడుందా అన్నదే సందేహం.

 

కాబట్టి అధికారంలోకి రావటానికి జగన్ నూటికి వెయ్యిశాతం కష్టపడినా ఫలితం దక్కేది అనుమానమే. అలాంటిది రేపటి ఎన్నికల్లో సిఎం అవ్వబోయేది తానే అంటే పనిచేసే నేతలు, శ్రేణులు పనిచేయటం కూడా మానేస్తారు. పోయిన ఎన్నికల్లో నేతలు, శ్రేణులు చేసిందదే. కాబట్టి అతివిశ్వాసం మానేసి తాను చేయాల్సిన పనేదో జగన్ చేసుకుంటే వెళితే బాగుంటుంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: