చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ ఇదే...!!

Vasishta

సంచలనం సృష్టిస్తున్న చిగురుపాటి జయరాం హత్యకేసు దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. అనైతిక సంబంధాలు, ఆర్థిక లావాదేవీలో జయరాం హత్యకు కారణాలని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. జయరాంకు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లో పలు వ్యాపారాలు ఉన్నాయి. వీటిలో మేనకోడలు శిఖా చౌదరి అలియాస్ మాధురిని పలు హోదాల్లో నియమించారు జయరాం. దీంతో ఆమె అన్నింటిలోనూ కీలకంగా మారింది.

 

శిఖా చౌదరితో జయరాంకు అక్రమ సంబంధం ఉన్నట్టు నిర్ధారణ అయింది. శిఖా చౌదరి కూడా ఈ విషయాన్ని పోలీసుల ముందు అంగీకరించినట్లు సమాచారం. శిఖా సోదరికి మెడికల్ సీటుకైన ఖర్చును కూడా జయరామే భరించారు. జయరాం ఆర్థిక వ్యవహారాలన్నీ శిఖా చౌదరి చుట్టూనే తిరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే కొన్నింటిలో జయరాం భార్యకు మాత్రమే చెక్ పవర్ ఉండడాన్ని శిఖా జీర్ణించుకోలేకపోయినట్టు తెలుస్తోంది. ఇదే క్రమంలో శిఖా చౌదరి.. తన స్నేహితుడు రాకేష్ రెడ్డి దగ్గర నాలుగున్నర కోట్లు అప్పు చేసినట్టు తేలింది. ఈ మొత్తాన్ని చెల్లించేందుకు జయరాం అంగీకరించినట్టు సమాచారం. ఇదే గొడవకు అసలు కారణం.

 

ఆ నాలుగున్నర కోట్ల రూపాయలకోసం జయరాంను తన ఇంటికి పిలిపించినట్లు రాకేష్ రెడ్డి పోలీసుల ముందు చెప్పినట్టు తెలుస్తోంది. ఇందుకోసం ఓ యాంకర్ సాయం తీసుకున్నట్టు తెలుస్తోంది. జయరాం ఇంటికి వచ్చినప్పుడు తనకు రావాల్సిన అమౌంట్ పై రాకేష్ గట్టిగా నిలదీసినట్టు తెలుస్తోంది. అదే క్రమంలో నాలుగు పిడిగుద్దులు కురిపించాడు. జయరాం హార్ట్ పేషెంట్ కావడంతో వెంటనే కుప్పుకూలిపోయినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కొంతసేపటికి జయరాం చనిపోయాడు. దీంతో డెడ్ బాడీని జయరాం కారులోనే తీసుకొచ్చి నందిగామ సమీపంలో వదిలేసి రాకేష్ రెడ్డి బస్ ఎక్కి వెళ్లిపోయాడు.

 

శిఖా చౌదరికి, రాకేష్ కి మధ్య సంబంధం చెడినట్టు తెలసింది. శిఖా చౌదరికి పలువురితో అక్రమ సంబంధాలు ఉన్నందువల్లే ఆమెకు దూరమైనట్టు రాకేష్ రెడ్డి పోలీసులకు వివరించాడు. లేకుంటే శిఖాను పెళ్లి చేసుకోవాలనుకున్నట్టు చెప్పాడు. అదే సమయంలో శిఖా కూడా రాకేష్ రెడ్డితో డేటింగ్ చేసినట్టు అంగీకరించింది. అయితే కోటీశ్వరుడైన జయరాం.. రాకేష్ రెడ్డి దగ్గర ఎందుకు అప్పు తీసుకున్నాడనేది ఆసక్తిగా మారింది. శిఖాను వదిలేస్తే నాలుగున్నర కోట్లు ఇస్తానని జయరాం డీల్ కుదుర్చుకున్నాడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఆ అమౌంట్ కోసమే ఇప్పుడు రాకేష్ రెడ్డి జయరాంను హత్య చేశారని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: