బీఆర్ఎస్ : రేవంత్ ఓటమి భయంతో వణుకుతున్నాడు..?

Pulgam Srinivas
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో కీలక సభ్యుడు అయినటువంటి హరీష్ రావు కాంగ్రెస్ పార్టీ పై , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై తనదైన స్థాయిలో ఎప్పటికప్పుడు మాటల దాడి చేస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా కరీంనగర్ ప్రెస్ మీట్ లో భాగంగా హరీష్ రావు మాట్లాడుతూ... రేవంత్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది. పార్లమెంటు ఎన్నికల్లో ఓడిపోతే పదవి పోతుందనే భయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే దేవుళ్లపై ఒట్టు పెట్టుకుంటూ రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ సెంటిమెంటల్ మాటలు మాట్లాడుతున్నాడు.

ఎన్నికల హమీల గురించి , నాలుగు నెలల పాలన గురించి రేవంత్ ఏమి మాట్లాడడం లేదు. అయితే తిట్లు లేకపోతే దేవుడిపై ఒట్లు. ఏ ఊరికిపోతే ఆ ఊరిలో దేవుళ్లపై ఒట్లతో ప్రజలను మోసం చేస్తున్నాడు. బాండు పేపర్లు నాటకం నడవదని దేవుళ్లపై ఒట్లు పెడుతున్నాడు.  బీఆర్ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని అబద్ధాలు ప్రచారం చేస్తున్నాడు. దొంగే దొంగ అన్నట్టున్నాయి ఆయన మాటలు.  

బీజేపీతో మ్యాచ్ ఫిక్స్ చేసుకున్నది రేవంత్. హుజారాబాద్‌, దుబ్బాక, మునుగోడుల్లో బలహీన అభ్యర్థులను పెట్టి బీజేపీ గెలవడానికి పరోక్షంగా సహకరించింది రేవంత్. నాగార్జన సాగర్ లోనూ ఆ రెండు పార్టీలు సహకరించుకున్నాయి. రిజర్వేషన్ల రద్దుకు బీఆర్ఎస్ బీజేపీకి సహకరిస్తుందని రేవంత్ అంటున్నాడు. తమిళనాడులో మాదిరిగా రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసింది బీఆర్ఎస్. పార్లమెంటులో కొట్లాడింది మేం.

రేవంత్‌ది అతితెలివి లేదా మతి మరుపు. గ్లోబెల్స్ ప్రచారంతో ఎంపీ ఎన్నికల గండం గట్టెక్కాలని ప్రయత్నిస్తున్నాడు. హిందువుల ఆస్తులు ముస్లింలకు పంచుతామని, రిజర్వేషన్లు రద్దు చేస్తామని మోదీ అంటున్నడు. పేదలు, రైతులు, గిరిజనుల గురించి మాట్లాడడం లేదు, సెంటిమెంట్స్ రెచ్చగొడుతున్నారు. రిజర్వేషన్లు పెంచడమే కాని రద్దు చేసేది ఉండదు. రేవంత్ అధికారంలోకి వచ్చాక కందిపప్పు, స్టీలు, సిమెంట్, కంకర, ఇసుక రేట్లు పెరిగాయి. పేదవాడు కండుపునిండా తినే పరిస్థితి లేదు.. ప్రజల అజెండా పక్కకుపోయిన సెంటిమెంట్ల అజెండా ముందుకొస్తున్నది అని హరీష్ రావు అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs

సంబంధిత వార్తలు: