రేవంత్ రెడ్డి : దేశ సంపదను మోడీ ఆ రాష్ట్ర పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నాడు..!

Pulgam Srinivas
ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో దూకుడు స్వభావం కలిగిన నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. ఈయన తన దూకుడు స్వభావం తోనే ఎంతో మంది రాజకీయ ప్రత్యర్థులను తనదైన రీతిలో మాటలతో ఎదుర్కొని చిన్న స్థాయి నుండి ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళాడు. ఇకపోతే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతను తన దూకుడు స్వభావాన్ని తగ్గిస్తాడు అని కొంతమంది అనుకున్నారు. కాకపోతే ముఖ్య మంత్రి అయిన తర్వాత కూడా రేవంత్ రెడ్డి తనదైన రీతిలో ముందుకు సాగుతూ ప్రత్యర్థులను ఎదుర్కొంటున్నాడు.

ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఎంతో మంది సీనియర్ , జూనియర్ నాయకులు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి నే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ ను అలాగే మరొక పార్టీ అయినటువంటి బీజేపీ లను ఎక్కువగా ఎదుర్కొంటూ వారు చేస్తున్న మాటలకు కౌంటర్ ఇస్తూ తనదైన రీతిలో దూసుకుపోతున్నాడు. ఇక దానితో రేవంత్ రెడ్డి క్రేజ్ మరింతగా పెరుగుతూ వస్తుంది.

ఇది ఇలా ఉంటే తాజాగా ముఖ్యమంత్రి, టిపిసిసి అద్యక్షులు రేవంత్ రెడ్డి పత్రికా విలేకరులతో ముచ్చటించారు. అందులో భాగంగా ఆయన మాట్లాడుతూ  మేము కేంద్రంలో అధికారంలోకి వస్తే ఏం చేస్తాం... ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే విషయాల గురించి గట్టిగా మాట్లాడారు. రేవంత్ రెడ్డి తాజా పత్రిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... దేశ సంపదను దేశంలోని పేదలకు పంచడానికి కాంగ్రెస్ పార్టీ తరపున హామీ ఇస్తున్నాం. దేశ సంపదను పెంచి , దేశంలోని ఎస్సీ , ఎస్టీ , ఓబీసీ , మైనారిటీ మరియు మహిళలకు సమానంగా పంచుతాం.

దేశంలోని ప్రతి ఒక్కరికి రాజ్యాంగ రక్షణ కల్పిస్తుంది. ప్రధాని మోడీ దేశ సంపదను గుజరాత్ లోని పారిశ్రామికవేత్తలకు దోచిపెడుతున్నారు. పారిశ్రామికవేత్తలకు లక్షల కోట్లు లోన్లు మాఫీ చేశారు. రైతులకు రుణమాఫీ చేయలేదు , యువతకు లోన్లు ఇవ్వలేదు , విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్లు ఇవ్వలేదు. వారు దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: