జగన్: బాలయ్య.. పవన్ లకు అదిరిపోయే కౌంటర్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఎక్కువగా ల్యాండ్ చట్టాల పైన ప్రతిపక్షాలు కూడా తీవ్రదుమారాన్ని చేస్తున్నారు.. జగన్ ప్రజల భూములను కొట్టేసి దోచేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. వీటిపైన ముఖ్యమంత్రి జగన్ కూడా సమాధానం తెలియజేస్తూ ఉన్నారు.. భూములు పట్టాలు చేయించుకున్న వారందరికీ డాక్యుమెంట్లు ఇచ్చారా లేదా అనే విషయాన్ని కూడా అడుగుతున్నారు.. కేవలం చంద్రబాబు అసత్య ప్రచారంపైనే ఫైరయ్యారు జగన్..

అలాగే ఈ ప్రచారాలను పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు ,లోకేష్ వంటి వారు కూడా ప్రచారం చేయడంతో వీరందరికీ ఒక్క సారి అదిరిపోయే కౌంటర్ వేశారు.. పవన్ కళ్యాణ్ మంగళగిరిలో భూములు కొన్నప్పుడు బాలకృష్ణ ఋషి కొండలో భూములు కొన్నప్పుడు ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చారా లేదా ఎక్కడా కూడా చట్టం నిబంధనలకు లోబడి పని చేస్తున్నాము తప్ప.. ప్రజల ఆస్తులను కొట్టేయాలని ఆలోచన తమకు లేదని కూడా వెల్లడించారు.. కేవలం ప్రతిపక్షాలు తమ పైన ఆరోపణలు చేస్తున్నారనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కూడా తెలియజేశారు. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్లు చేయించుకున్న 9 లక్షల మంది ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇచ్చాము చంద్రబాబు కుట్రలతో పథకాలకు రూపురేఖలు మార్చాలని మాత్రమే చూస్తున్నారని తెలిపారు.

పరిపాలనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటున్నామని అలాగే ప్రజల అవసరాలకు తీర్చే పథకాలను మాత్రమే ప్రవేశపెడుతున్నామంటూ వారికి ఎలాంటి నష్టం కలగకుండా ఉండేలా చూసుకుంటున్నామని వెల్లడించారు.. ప్రజలకు ఇప్పటికే ఎన్నోసార్లు నగదు పంపిణీ చేసాము పలు పథకాల పేరుతో ప్రజల ఖాతాలలో కూడా డైరెక్ట్ గానే డబ్బులు జమ చేసాం కానీ ఎక్కడ అవినీతికి పాల్పడలేదని నీతి నిజాయితీతోనే పనిచేశామంటూ తెలిపారు. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని తపన పడుతున్నాము అలాగే పలు పథకాలు ప్రారంభించి ఇప్పటికే ప్రజలను ఇబ్బంది లేకుండా చూస్తున్నామంటూ తెలిపారు. కేవలం కూటమిలోని కుట్రలో భాగంగానే ల్యాండ్ టైటిలింగ్ వాటిపైన దుష్ప్రచారం చేస్తున్నారని తెలిపారు.. లోకేష్ పవన్ బాలకృష్ణ రిజిస్ట్రేషన్ చేయించుకున్న భూములకు ఒరిజినల్ పట్టాలు ఇచ్చామా లేదా వారినే చెప్పమంటూ కౌంటర్ వేశారు జగన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: