టీడీపి: ఊపే లేని బీజేపీ గెలిపిస్తుందా.. మరి జనసేనా..?

Divya
గత కొద్ది రోజుల నుంచి బిజెపి పార్టీకి అనుకూలంగా గాలివీయడం లేదని వామపక్షాల నేతలు సైతం తెలియజేస్తున్నారు.. బిజెపికి బలం తగ్గుతోందని అందుకే నరేంద్ర మోడీ ,అమిత్ షా వంటి వారు మైనార్టీల వర్గాల విషయంలో కాస్త ఘాటుగానే వాక్యాలు చేశారు .. ఇటీవల విజయవాడలో తాజాగా జరిగిన ఒక సమావేశంలో సిపిఎం సీనియర్ నేత సీతారామ కూడా విమర్శించారు... ముఖ్యంగా ఆంధ్రాలో టిడిపి ఎన్డీఏ కూటమిలో చేరడం చాలా తప్పని కూడా ఆయన అభిప్రాయంగా వెల్లడించారు.

బిజెపి మోడీ గ్లామర్ తమకు ఉపయోగపడుతుందని భావించారు కనుక చేరారు.. కానీ ఇదంతా ఇలా ఉంటే ఏపీలో టిడిపి జనసేన కలిసి ఉన్నప్పుడు వచ్చిన రియాక్షన్ బిజెపి చేరిన తర్వాత అంతగా రాలేదని భావన కూడా ఉన్నదట. అందుకు సీతారామన్ ఏచూరి కామెంట్స్ చేస్తూ ఏపీలో ముస్లిం రిజర్వేషన్లు రద్దు మీద బిజెపి పెద్దలు ఎక్కువగా మాట్లాడకపోయినా దేశమంతా కూడా ఇదే విషయం గురించి మాట్లాడుతున్నారని దీంతో అది అంతిమంగా టిడిపి కూటమికి చేటు చేస్తుందని వామపక్షాలు కూడా తెలియజేస్తున్నాయి.
ఒక వర్గంలో అభద్రత భావం కలిగిందని దీనిమీద రాజకీయ లబ్ధి పొందాలని బిజెపి ప్రభుత్వం చూస్తోందంటూ వెల్లడించారు. టిడిపి కూడా బిజెపితో కలిసి ఉన్నందువలన కచ్చితంగా టిడిపి పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవంటూ కామ్రేడ్ వెల్లడించారు. ఆంధ్రాలో రాజకీయాలను కేవలం జగన్ వర్సెస్ చంద్రబాబు అన్న కోణంలో మాత్రమే చూడకూడదని జాతీయ కోణం గురించి కూడా ప్రజలు చూడాలని తెలియజేస్తున్నారు. మరి ఈరోజు బిజెపి పార్టీ గమనం మెల్లమెల్లగా తగ్గుతున్న నేపథ్యంలో 2014 లాగా 2024 లో కూడా ఉంటుందా అనేది పార్టీ నేతలే చెప్పాలని తెలుపుతున్నారు. 2014లో మోడీకి ఉన్న సానుకూలత ఇప్పుడు లేదని పరిస్థితి రోజురోజుకి మారుతోందంటూ కూడా తెలిపారు. ఇక జనసేన పార్టీ నాయకులు నేతలు కూడా టిడిపి తో కలిసి ఉన్నప్పటికీ ఓటింగ్ వేస్తారా లేదా అనే విషయం పైన సందిగ్ధత్తోనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: