సర్వేపల్లి: సోమిరెడ్డి దండయాత్ర ఈసారైనా ఫలిస్తుందా?

ఏపీలో రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తిరేపుతున్న నియోజక వర్గాల్లో సర్వేపల్లి ఒకటి. ఇక్కడ నెల్లూరు రెడ్లు ఇద్దరూ పోటీ పడుతున్నారు. మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వైసీపీ నుంచి బరిలో ఉంటే.. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి మరోసారి ఇక్కడ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి ఇక్కడ వరుసగా ఐదు సార్లు ఓడిపోయారు. ఈసారి టీడీపీ  టికెట్‌ ఆయన్ను మార్చి ఆయన కుమారుడికి ఇస్తారని భావించినా.. చంద్రబాబు మాత్రం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చి బరిలో నిలిపారు.

గజనీ మహమ్మద్‌ను తలపించేలా ఇక్కడ reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రయత్నం సాగుతోంది. చంద్రబాబు విధేయుడైన నేతగా పేరున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. 2014లో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఆయన్ను ఎమ్మెల్సీని చేసి మరీ చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఇదే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఓడించిన కాకాణి గోవర్థన్‌ రెడ్డిని జగన్‌.. మంత్రిని చేశారు.

ఇక ప్రస్తుత విషయానికి వస్తే.. ఇక్కడ మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డికే ఎడ్జ్‌ కనిపిస్తూ ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో మారిన రాజకీయ పరిస్థితులు తనకు కలసి వస్తాయని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భావిస్తున్నారు. అంతే కాకుండా.. ఐదు సార్లు వరుసగా ఓడిపోవడం వల్ల తనకు సానుభూతి కూడా కలసి వస్తుందని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. గెలుపు ఓటమిలతో సంబంధం లేకుండా సర్వేపల్లి ప్రజల వెంట తాను ఉన్నానని reddy SOMIREDDY' target='_blank' title='సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రచారంలో చెప్పుకుంటున్నారు.

ఇక మంత్రి కాకాణి గోవర్థన్‌ రెడ్డి ఇప్పటికే ఇక్కడ రెండు సార్లు వరుసగా గెలిచారు. ప్రస్తుతం ఆయన హ్యాట్రిక్‌ విజయం కోసం కృషి చేస్తున్నారు. స్థానికంగా పట్టు ఉండటం.. అధికారంలో ఉండటం.. ఆయనకు కలసి వచ్చే అంశాలు. సోమిరెడ్డి కాలం చెల్లిన నాయకుడని.. తానే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయగల నాయకుడినని కాకాణి చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతానికి కాకాణికే ఎడ్జ్ కనిపిస్తున్నా హోరాహోరీ పోరు మాత్రం తప్పదన్నది ఇండియా హెరాల్డ్‌ అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: