పవన్కి మద్ధతు తెలుపుతూ హీరో నితిన్ ట్వీట్!

Purushottham Vinay
ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అందరి దృష్టి అక్కడే ఉంది. పవన్ కళ్యాణ్ కోసం మెగా ఫ్యామిలీ అంతా కూడా రంగంలోకి దిగింది.ఇప్పటికే మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయి దుర్గ తేజ్ పవన్ కళ్యాణ్ కు మద్దతుగా ప్రచారం చేశారు. రోడ్ షోల్లో కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని కోరారు. చిరంజీవి కూడా స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో మద్దతు ప్రకటించిన చరణ్.. నేడు పిఠాపురం వెళ్లారు. 

అల్లు అర్జున్, నాని కూడా ట్వీట్ చేసి మద్దతు తెలిపారు.అలాగే దివంగత నటుడు కృష్ణంరాజు భార్య, హీరో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి కూడా పవన్ కు మద్దతు తెలిపారు. తాజాగా పవన్ కి వీరాభిమాని అయిన నితిన్ కూడా పవన్ కి సపోర్ట్ చేస్తూ X లో ట్వీట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: