తెలంగాణ టీఆర్‌ఎస్ దే : టైమ్స్‌నౌ-సిఎన్ఎక్స్ - ప్రీ పోల్స్ సర్వే:


డిసెంబర్ 7న జరగనున్న ఎన్నికల్లో గులాబి గుభాళింపు ఖాయమంటూ,  తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్‌కే పట్టం కట్టనున్నారని లేటెస్ట్ టైమ్స్‌నౌ ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. టీఆర్‌ఎస్ 70 సీట్లను గెలుచుకోనున్నట్టు టైమ్స్‌-నౌ- ప్రీ పోల్స్ సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ 31 సీట్లను, టీడీపీ 2, ఎమ్‌ఐఎమ్ 8, బీజేపీ 3, ఇతరులు 5 సీట్లు గెలుచుకోనున్నట్లు సర్వే ప్రకటించింది.

తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ కావాలని 45.27 %  ప్రజలు కోరుకోగా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి 30.55 %,  కోదండరాం కు 3.37 %  ప్రజల మద్దతు లభించింది. ఇక టీఆర్‌ఎస్‌కు 37.55 %  ఓట్లు, కాంగ్రెస్‌కు 27.98 %, టీడీపీకి 5.66, ఎమ్‌ఐఎమ్‌కు 4.10 %, బీజేపీకి 11%, ఇతరులకు 13.71 % అని సర్వే వెల్లడించింది

.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో టీఆర్‌ఎస్ పార్టీ ప్రముఖపాత్ర పోషించిందని 45.73 %  ప్రజలు తెలుపగా, కాంగ్రెస్ ప్రముఖపాత్ర పోషించిందని 32.90%, సర్వే వెల్లడించింది. తెలంగాణ వ్యతిరేకపార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల సెంటిమెంట్‌ను హర్ట్ చేసిందని 52.44 % ప్రజలు తెలిపినట్లు సర్వే .

ఈ సర్వేను బట్టి రాహుల్ గాంధీ-చంద్రబాబు పొత్తును తెలంగాణ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలుస్తోంది. 2014లో టీఆర్‌ఎస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 34.30 కాగా.. ఈసారి 37.55 % రానున్నట్టు సర్వే తెలిపింది. అంటే 3.25 % ఓట్ల శాతం టీఆర్‌ఎస్‌కు పెరిగింది. టీడీపీకి 2014 లో 14.70 % ఓట్లు రాగా.. ఇప్పుడు 5.66 % ఓట్లే వస్తాయని,  అంటే టీడీపీ ఓట్ల శాతం 9.04 % తగ్గుతోంది. దీన్ని బట్టి తెలంగాణ ప్రజలు టీడీపీని ఎప్పుడో తిరస్కరించారని అర్థం అవుతోంది. .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: