బాబు ప్రభుత్వం చెసే ప్రతి తప్పుడుపనికి కర్తలు వేరెవాళ్ళు? క్రెడిట్స్ కి కారణ కర్త మాత్రం తనే!

"సబ్బుబిళ్ళా, కుక్కపిల్లా కవిత కేదీ అనర్హం కాదని" శ్రీ శ్రీ అన్నట్లు, చంద్రబాబు నాయుడిక ప్రచారానికి బాబ్లీ ఐనా, పోలవరమైనా అనర్హం కాదు. ప్రత్యేక హోదాపై పదుల సార్లు నాలుక మడతేసి శాసనసభలో సైతం ప్రత్యేక హోదా సంజీవని కాదని ప్రకటన చేసి అక్కడా నాలుక మడతేసిన వ్యక్తి చంద్రబాబు. రాజకీయాల్లో నైతికతకు పూర్తిగా తిలోదకాలు ఇవ్వవచ్చనే రాజనీతి సృష్టికర్త ఆయన. 

ఐతే ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమాతో పాటు మరో 14 మందికి మహరాష్ట్ర దర్మాబాద్ మెజిస్ట్రేట్‌ కోర్టు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. 
బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010లో చేసిన పోరాటానికి గాను ఈ వారెంట్‌ ఇస్తూ, ఈ నెల 21లోగా చంద్రబాబుతో పాటు మిగతా వారంతా హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. 
కేసు ఇప్పుడు పెట్టిందా? 

ఈ ఉదయం నుంచే ఇలాంటి ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికి తాజాగా సీఎంకు నోటీసులు రావడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా తెలుగుదేశం వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 2010లో మహారాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ తెలుగుదేశం పార్టీ అప్పుడు పెద్దఎత్తున ఆందోళన చేపట్టింది. 40మంది ఎమ్మెల్యేలతో కలిసి అప్పట్లో ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు తెలంగాణ సరిహద్దు దాటి మహారాష్ట్ర లోని బాబ్లీ ప్రాజెక్టు వద్దకు దాదాపుగా దండెత్తి వెళ్లేందుకు ప్రయత్నం చేశారు. 

ఆయన ఉద్దేశం అప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిపై మైలేజ్ సాధించటమే. ఆ ఆతృతలో ప్రచార పటాటోపంతో, ముందు కెళ్ళి పితలాటకంలో ధారుణంగా ఇరుక్కొని పీక్కుంటున్నారు. ఆనాడే చట్టాలను విస్మరించారని జనం కోడై కూసింది.  చంద్రబాబుతో పాటు నాడు పాల్గొన్న 40 మంది ఎమ్మెల్యేలను అరెస్టు చేసి మహారాష్ట్ర పోలీసులు నాన్‌-బెయిలబుల్‌ కేసు నమోదుచేశారు. అప్పటి నుంచి ఈ కేసు ధర్మాబాద్‌ కోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇటీవల మహారాష్ట్రవాసి ఒకరు ధర్మాబాద్‌ కోర్టులో పిటిషన్‌ వేయడంతో బాబ్లీ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. 

అయితే, దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆ కేసును తవ్వితీయడం ఏమిటనే ప్రశ్న లేవనెత్తి, ఇప్పుడు అన్నీ పాపాలకు మోడీయే కారణం, అనే థియరీని ప్రచారం చేయటానికి అలవాటు పడిన దరిమిలా, బిజెపిని బదనాం చేయాలని విఫల ప్రయత్నం చేసింది టిడిపి. కాని ఆ కేసు కాంగ్రెస్ హయాంలో ఫైలైంది. అప్పుడు కాంగ్రెసు ను బదనాం చేసిన చంద్రబాబు, నేడు బిజెపి ప్రభుత్వాన్ని బదనాం చేయటం చూస్తే తాను చెసే ప్రతి పనికి కర్త కాని కర్మ కాని తను కాదని వేరేవాళ్ళని చెపుతూ రావటం  చూస్తున్న జనం ఆయన్ను అసహ్యించుకుంటున్నారు. ఆయనకు రానున్న ఎన్నికల్లో చరమగీతం పాడటానికి నిరీక్షిస్తున్నారు. వైసిపి నాయకుడు జగన్మోహనరెడ్డి పలు సార్లు చెపుతూనే ఉన్నారు. 


ఈ మహానుభావుడి వల్ల ఎవరికైనా  కనీసం రాష్ట్రానికైనా ఏ చిన్న ప్రయోజనం ఉందా?


తెదేపా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా కూర్చుందని ఇప్పుడు మహరాష్ట్రలో బిజెపి ప్రభుత్వం ఉండటంతో దాన్ని కూడా మోడీపై తోసెయ్యాలని చూడటం పరమ దుర్మార్గం అంటున్నారు జనం. ప్రస్తుతం సీఎం చంద్రబాబు తిరుమలలో ఉన్నారు. ఆయనను ఇప్పుడు తిరుమలవాసుడు దగ్గర నుండే గమనిస్తూనే ఉంటాడట 


చంద్రబాబుకు నాన్‌-బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంపై మాజీ సీబీఐ జేడీ లక్ష్మీ నారాయణ స్పందించారు. చంద్రబాబుకు నోటీసుల వెనుక నరెంద్ర మోదీ ఉన్నారని టీడీపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 



2013నుంచి కేసు నడుస్తోందని, అప్పటి నుంచీ వారికి నోటీసులు వస్తున్నాయని, 2016 వరకు తెదేపా నాయకులు అప్పుడప్పుడు కోర్టుకువెళ్తూ వచ్చారని తెలిపారు. కానీ చంద్రబాబు 22 వాయిదాలకు వెళ్లక పోవడం వల్లే వారెంట్‌ వచ్చిందని బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ కూడా పేర్కొన్నారు.

ఈ కేసు ముదిరేలా ఉందని ముందే తెలిసి, బాబ్లీకేసులోంచి బైటపడేందుకే మహారాష్ట్ర ఆర్థికమంత్రి భార్యకు టిటిడి బోర్డులో చంద్రబాబు స్థానం కల్పించారని వైసిపి  ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి  ఆరోపించారు. తనపై కేసులు పెట్టిన మహారాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రి భార్యకు టిటిడిలో స్థానం కల్పించడంలో అంతర్యమేమిటని  ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం ఇంత జరుగుతున్నా ఆ మంత్రి భార్యను ఎందుకు తొలగించట్లేదని శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు.

రాయలసీమలో దుర్భిక్షం ఉంటే చంద్రబాబు మాత్రం శ్రీశైలంకు వచ్చి  "జలసిరి హారతి" అంటూ కట్టుకథలు చెబుతున్నారని మండిపడ్డారు.  పోతిరెడ్డిపాడు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నాలు చేసిన మంత్రి దేవినేని ఉమ నేడు సాగునీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. సొంత జిల్లా చిత్తూరుతో పాటు రాష్ట్రం లోని ఏ జిల్లా రైతులతోనైనా చంద్రబాబు రైతు బాంధవుడని అనిపించుకునే ధైర్యం ఉందా? అని సవాలు విసిరారు. 

సినిమాలు లేకుండా చాలాకాలం నుండి పడాకున పడి ఉన్న నటులతో  “ఆపరేషన్‌ గరుడ, ఆపరేషన్‌ ద్రవిడ" అని కట్టుకథలు చెప్పించి జనాలను నమ్మించాలని చూస్తున్నారని తెలిపారు. అది ఆపరేషన్‌ గరుడ కాదని, ఆపరేషన్‌ పెరుగు, వడ, అప్పడం అని అన్నారు. కోర్టు నోటీసులు వస్తే ఇంత భయం ఎందుకని ప్రశ్నించారు. 
22 సార్లు నోటీసులిస్తే కోర్టుకు హాజరవ్వకుండా ఇప్పుడు హడావిడి చేస్తున్నారని, అలాగే ఏవరో ఒక పిచ్చోడు 'ఆపరేషన్  తొక్క తోలు డోలు' అంటే దానికి ప్రచారమిచ్చే ప్రభుత్వానికి, దానికి వంతపాడే చెత్త మీడియాకు, చరమగీతం పాడవలసిందే అంటున్నారు సర్వం తెలిసిన రాజకీయ విశ్లేషకులు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: