అందుకే మిలటరీ చొక్కా ధరించాను : పవన్

Edari Rama Krishna
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా కల్లబొల్లి మాటలు చెబుతుందని..అభివృద్ది చేస్తున్నామని చెబుతున్నా ఎక్కడా కనిపించడం లేదని ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్.  తన రాష్ట్ర వ్యాప్త పర్యటనను శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. తన యాత్ర సందర్భంగా పలు సమస్యలపై ఆయన గళం వినిపిస్తున్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు తన పోరాటం ఆగదని ఆయన హెచ్చరిస్తున్నారు.

ప్రజల కోసం తాను పోరాటానికి సిద్దంగా ఉన్నానని..తన చివరి రక్తపు బొట్టు ప్రజల కోసమే అని అన్నారు. తాను ఎవరికీ భయపడనని, ఎన్ని అడ్డంకులు ఎదురైనా జనసైనికులతో కలసి పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేస్తానని ఆయన చెప్పారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాన్ ఏ యాత్ర చేసినా..ఏ సభల్లో హాజరైనా..తెల్లని బట్టలు వేసుకునే వారు..కానీ శ్రీకాకుళం యాత్రలో ఆయన  వేషధారణ అందరినీ ఆకట్టుకుంటోంది.

మిలిటరీ రంగు చొక్కా ధరించి, మెడలో ఎర్ర రంగు కండువా వేసుకుని ఆయన ఉద్రేకపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తన వేషధారణ గురించి పవన్ స్పందిస్తూ, దేశంలో ఏ మూలకు వెళ్లినా శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ సైనికుడు కనపడతాడని, జైహింద్ అంటాడని చెప్పారు. వారి స్ఫూర్తితోనే తాను మిలిటరీ చొక్కా ధరించానని తెలిపారు. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: