చంద్రబాబు చేస్తున్న లేటెస్ట్ మిస్టేక్..!?

Vasishta

చంద్రబాబు ఏం చేసినా లేటెస్ట్ గా ఉంటుంది. వరల్డ్ క్లాస్ టెక్నాలజీని రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాజాగా హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ సిస్టమ్ ను అమరావతికి తీసుకొస్తున్నారు. భారత్ లోనే తొలిసారిగా చేపట్టబోతున్న ఈ ప్రాజెక్టు సక్సెస్ అయితే రవాణారంగంలో విప్లవాత్మక మార్పులు రావడం తథ్యం.


        అమరావతి – విజయవాడ మధ్య హైపర్ లూప్ రవాణావ్యవస్థను తీసుకొచ్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు హైపర్ లూప్ ట్రాన్స్ పోర్టేషన్ టెక్నాలజీస్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు రూ.1600 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబోయే ఈ ప్రాజెక్టును 2020-21 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పుడు విజయవాడ నుంచి అమరావతి వెళ్లడానికి సుమారు 45 నిమిషాల సమయం పడుతోంది. హైపర్ లూప్ అమల్లోకి వస్తే కేవలం 5 నిమిషాల్లోనే అమరావతి చేరుకోవచ్చు.


        శూన్యపు గొట్టాలద్వారా ప్రయాణించడమే హైపర్ లూప్ రవాణా. గంటకు సుమారు 1200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చని HTT సంస్థ చెప్తోంది. అయితే ఇక్కడే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అసలు హైపర్ లూప్ టెక్నాలజీతో ఇప్పుడు ఎక్కడైనా రవాణా జరుగుతోందా..? ఎక్కడైనా ఇది సక్సెస్ అయిందా..? అంటే దానికి సమాధానం లేదు. HTT సంస్థ కూడా తాను ప్రయోగాత్మకంగా చేపట్టినవాటి గురించే చెప్తూ ఈ ప్రాజెక్టును చేజిక్కించుకుంది.


        ఎక్కడా అమల్లోలేని, అసలు ఆచరణసాధ్యం అవుతుందో లేదో తెలీని ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గాలిలో ధ్వనివేగం సెకనుకు 330మీ. అంటే గంటకు 1188 కి.మీ. ఇప్పుడు హైపర్ లూప్ ద్వారా గంటకు 1200 కి.మీ. వేగంతో ప్రయాణించవచ్చని చెప్తున్నారు. ఇది ఆచరణ సాధ్యమేనా..? శూన్యపు గొట్టాల్లో ప్రయాణం సేఫేనా..? ఇలాంటి వాటన్నిటికి ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: