డెలివరీ ఆగింది.. స్విగ్గికి భారీ జరిమానా?

praveen
నేటి టెక్నాలజీ యుగంలో అన్ని పనులు ఎంతో సులభతరంగా మారిపోయాయి అన్న విషయం తెలిసిందే. ఇక ఒకప్పుడు ఏదైనా కావాలి అనిపించింది అంతే చాలు ఇక బయటకు వెళ్లి తెచ్చుకునేవారు అందరూ. కానీ ఇప్పుడు బయటకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది. వేసుకునే చెప్పుల దగ్గర నుంచి తినే ఆహారం వరకు ప్రతి ఒక్కటి కూడా ఆన్లైన్లోనే దొరికేస్తుంది. అరచేతిలో ఉన్న స్మార్ట్ఫోన్లో ఒక్క క్లిక్ ఇస్తే చాలు అన్ని కూడా ఇక ఇంటి ముందుకు వచ్చి డెలివరీ చేసేస్తూ ఉన్నారు. దీంతో సామాన్యుడు సైతం సంపన్నుడి లాగా ఇక కుర్చీలో కూర్చునే.. అన్ని దగ్గరికి తెప్పించుకుంటూ జీవితాన్ని గడుపుతున్న పరిస్థితి నేటి రోజుల్లో కనిపిస్తుంది.

 మరి ముఖ్యంగా ఒకప్పుడు కావాల్సిన ఆహారం కోసం ఎక్కడికో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడేది. కానీ ఇప్పుడు ఏ రెస్టారెంట్ నుండి అయితే ఆహారం కావాలో అక్కడి నుంచి ఫుడ్ ఆర్డర్ చేసి తప్పించుకోవచ్చు. ఇలా ఆహారం డెలివరీ చేసేందుకు స్విగ్గి, జొమాటో సహా మరికొన్ని కంపెనీలు కూడా సర్వీసులు అందిస్తూ ఉన్నాయి అనే విషయం తెలిసిందే. అయితే కొన్ని కొన్ని సార్లు ఇలా ఆన్లైన్లో ఫుడ్ డెలివరీ విషయంలో కస్టమర్లకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. ఇక్కడ ఒక కస్టమర్ కి ఇలాంటి చేదు అనుభవం ఎదురయింది. అతనికి కోపం వచ్చి చివరికి వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా.. ఇక స్విగ్గి కంపెనీకి భారీ జరిమానా పడింది.

 ఆర్డర్ డెలివరీ చేయలేకపోయినందున ఫుడ్ డెలివరీ యాప్ అయినా స్విగ్గికి కోర్టు జరిమానా విధించింది. ఈ ఏడాది జనవరిలో బెంగళూరుకు చెందిన ఒక యువతి స్విగ్గిలో ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టిం.ది అయితే ఆర్డర్ తనకు అందక పోయినప్పటికీ డెలివరీ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో ఇదే విషయంపై అటు బాధితురాలు బెంగుళూరులోని వినియోగదారుల కోర్టును ఆశ్రయించింది. ఇక ఇదే విషయంపై వాదోపవాదాలు విన్న వినియోగదారుల కోర్టు.. ఏకంగా సదరు బాధితురాలికి ఐస్ క్రీమ్ యొక్క రేటును చెల్లించడమే కాదు 5000 రూపాయల జరిమానా చెల్లించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: