సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న బిగ్ బాస్ బ్యూటీ కామెంట్స్...!!
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన స్కూల్ డేస్ లో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాన్ని బయటపెట్టింది. ఒక్కొక్క సందర్భంలో హిమజ ఫేస్ బుక్ లో కట్టె పుల్లకు చీర కట్టిన సరే హాయ్, బాయ్ అని చెప్తారని కామెంట్స్ చేసింది. తాజాగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో ఈమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం వేపుతున్నాయి. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ ఇప్పటివరకు మీకు ఎంతమంది ప్రపోజ్ చేశారు? అనే ప్రశ్న అడగగా.. దానికి హిమజ స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఇక ఈ వ్యాఖ్యలను చూసిన కొంతమంది మగవాళ్లు మేము అసలు మీకు ఎలా కనిపిస్తున్నాం అంటూ విరుచుకుపడుతున్నారు. తనేదో క్యాజువల్ గా సోషల్ మీడియా ప్లాట్ఫార్మ్స్ ను ఉద్దేశించి చెప్పానని.. దానికే ఇలా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారు గా అంటూ రియాక్ట్ అయ్యింది హిమజ.
సోషల్ వెబ్సైట్లో దాదాపు 80 శాతం ఫేక్ ప్రపోజల్స్ మాత్రమే ఉంటాయనేది తన ఉద్దేశమని చెప్తూనే తనకు ప్రపోజ్ చేయాలంటే భయపడతారని వెల్లడించింది హిమజ. తన గురించి బాగా తెలిసినవారు తప్ప ఇంకెవరు మాట్లాడే ధైర్యం చేయరని ప్రపోజల్స్ ఎందుకు రాలేదో వెల్లడించింది. ఈ సందర్భంగా నే చిన్నప్పుడు తనకి జరిగిన ఓ ఘటనను వెల్లడించింది. ” కాలేజీ డేస్ లో ఒక అబ్బాయిని ఇష్టపడ్డాను. ఆ తర్వాత వన్ సైడ్ లవ్ ను లైట్ తీసుకున్నాను. ఇది కాలేజీలో జరగలేదు స్కూల్లో జరిగింది. స్కూల్ పేరు చెప్పను కానీ చాలా స్ట్రిట్ గా ఉండే స్కూల్ అది. అమ్మాయిలు మరియు అబ్బాయిలు ఒకరితో ఒకరు మాట్లాడకూడదు అనే రూల్ అక్కడి ఉంది.
జస్ట్ అలా చూసుకునే వాళ్ళం మాత్రమే. కానీ దాన్నే అపార్థం చేసుకుని పెద్ద ఇష్యూ చేశారు. అంతేకానీ అక్కడ లవ్ అనేది ఏమీ లేదు ” అంటూ చెప్పుకొచ్చింది హిమజ. ప్రస్తుతం ఈమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఇక ప్రస్తుతం హిమజ తన కెరీర్ పై మంచి దృష్టి పెట్టి వరుస సినిమా అవకాశాలను అందుకుంటు దూసుకుపోతుంది. మొదట్లో ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ తో ప్రేక్షకులకి పరిచయమైనప్పటికీ అనంతరం సినిమాలలో హీరోయిన్స్ మరియు ఇతర క్యారెక్టర్స్ లో నటిస్తూ ప్రతి ఒక్కరిని అలరిస్తుంది. ఇక రానున్న రోజుల్లో కూడా హిమజ మరిన్ని అవకాశాలు అందుకుని మంచి పేరు సంపాదించుకోవాలని తన అభిమానులు ఆశిస్తున్నారు.