పవన్‌ కల్యాణ్‌: గెలిచినా ఓడినట్టేనా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్  ఈ ఎన్నికల్లో కూటమితో జట్టు కట్టి ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఆయన లక్ష్యం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. జగన్ ను గద్దె దించి.. తాను ఆస్థానంలో కూర్చోవడమా.. లేక తాను ఏపీలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడమా? తన రాజకీయ జీవితాన్ని ఫణంగా పెట్టి చంద్రబాబుని సీఎం చేయడమా అనేది అంతు చిక్కడం లేదు.

మొత్తం మీద ఈ ఎన్నికల్లో పవన్ పోటీ చేసి ఏం సాధిద్దామనుకుంటున్నారో జనసైనికులకు కూడా తెలియడం లేదు. ఒకవేళ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని అనుకుంటే గత ఎన్నికల మాదిరిగా తనతో కలిసి వచ్చే పార్టీలతో కలిసి నడిస్తే సరిపోయేది. గతంలో జనసేన పార్టీకి 6శాతం ఓట్లు సాధించగలిగింది. ఈ సారి ఎన్నికల్లో జనసేన ప్రభావం పెరిగే అవకాశం ఏర్పడింది.  కానీ అనూహ్యంగా పవన్ చంద్రబాబుతో చేతులు కలిపారు. వాస్తవానికి ఈ పొత్తు పవన్ కన్నా చంద్రబాబుకి అత్యవసరం.

ఎందుకంటే ఈ సారి ఎన్నికల్లో గెలవకపోతే టీడీపీ మనుగడ ఏపీలో ప్రశ్నార్థకం అవుతుంది. చంద్రబాబుకి ఎలాగూ ఏడుపదుల వయసు ఉంది కాబట్టి ఇక రాజకీయ రిటైర్మెంట్ తప్పనిసరి అయ్యేది. కానీ పవన్ కు ఇంకా భవిష్యత్తు ఉంది.  ఇప్పుడు టీడీపీ పడిపోతే ఆ స్థానాన్ని జనసేన ఆక్రమించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. కానీ తన రాజకీయ జీవితాన్ని ప్రమాదంలో నెట్టి టీడీపీతో చేతులు కలిపారు.

పైగా సీట్లు డిమాండ్ చేయాల్సింది పోయి చంద్రబాబుకి మాయలో పడి 21 సీట్లకు తలాడించారు. పోని వాటిని ఏమైనా తన పార్టీ నాయకులకు ఇచ్చారా అంటే అదీ లేదు. టీడీపీ, వైసీపీ నుంచి వచ్చిన వారికే కేటాయించారు. ఇలా కాకుండా బీజేపీతో కలిసి వైసీపీని, టీడీపీని ఢీ కొడితే వచ్చే ఎన్నికలకు అయినా ప్రత్యామ్నాయ శక్తిగా జనసేన ఎదిగేది అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఇప్పుడు పవన్ గెలిచినా సాధించేది ఏమీ లేదు. అదే ఒంటరిగా ఉండి ఓడినా అది గెలుపే అయ్యేది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: