బనగానపల్లె కోటపై ఆ పార్టీ జెండా ఎగరనుందా.. ప్రజల మద్దతు ఎవరికంటే?

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని బనగానపల్లె నియోజకవర్గంలో ఈ ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందో అని ఏపీ ప్రజలు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ నుంచి బీసీ జనార్ధన్ రెడ్డికి టికెట్ దక్కగా వైసీపీ నుంచి కాటసాని రామిరెడ్డికి టికెట్ దక్కడం గమనార్హం. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి కాటసాని రామిరెడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో బనగానపల్లె కోటపై టీడీపీ జెండా ఎగిరే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
 
బీసీ జనార్ధన్ రెడ్డికి స్థానిక ప్రజల్లో మంచి పేరు ఉంది. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆయన స్థానిక ప్రజల్లో మంచి పేరును సొంతం చేసుకున్నారు. గత ఎన్నికల్లో జగన్ వేవ్ వల్ల బీసీ జనార్ధన్ రెడ్డి ఓటమిపాలయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయినా సొంత డబ్బులతో అభివృద్ధి కార్యక్రమాలు చేసి బీసీ జనార్ధన్ రెడ్డి ప్రజల ఆదరాభిమానాలను చూరగొన్నారు.
 
ఎన్నికల సమయంలో వైసీపీ కార్యకర్తలను టీడీపీలో చేర్చుకోవడం ద్వారా బీసీ జనార్ధన్ రెడ్డి పార్టీ పుంజుకునేలా చేయడంలో సక్సెస్ అయ్యారు. కాటసాని రామిరెడ్డి ప్రధాన అనుచరులు టీడీపీలో చేరడం ఆయనకు మరింత కలిసొస్తోంది. నియోజకవర్గంలోని కొన్ని గామాలలో వైసీపీ ఖాళీ అయిందని భోగట్టా. మైనార్టీ కుటుంబాలు సైతం ఈ నియోజకవర్గంలో టీడీపీకి మద్దతు ఇవ్వడం గమనార్హం.
 
కాటసాని రామిరెడ్డి పాలన సంతృప్తికరంగా లేకపోవడంతో నియోజకవర్గంలో పరిస్థితులు శరవేగంగా మారిపోతున్నాయి. బీసీ జనార్ధన్ రెడ్డి గెలుపు కోసం ఆయన కుటుంబ సభ్యులు సైతం ఎంతో కష్టపడుతున్నారు. ఈ నియోజకవర్గంలో వార్ వన్ సైడ్ గా మారుతోందని స్థానికులు చెబుతున్నారు. బీసీ కుటుంబ సభ్యులకు ప్రజల నుంచి మద్దతు లభిస్తుండటం గమనార్హం. కాటసాని రామిరెడ్డి సైతం గెలుపు కోసం తన వంతు కష్టపడుతున్నారు. ఈ ఎన్నికల ఫలితాలు తనకే అనుకూలంగా వస్తాయని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఎన్నికల ఫలితాలు వైసీపీకి అనుకూలంగా వస్తాయో లేక టీడీపీకి అనుకూలంగా వస్తాయో చూడాల్సి ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: