నంద్యాలలో టెన్షన్ : భూమా, శిల్పా కుటుంబాల మధ్య ఘర్షణ

Vasishta

నంద్యాల ఉపఎన్నిక పోలింగ్ ముగిసింది. ఎవరికి వారు గెలుపు తమదేననే ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ ముగుస్తున్న దశలో జరిగిన స్వల్ప ఘర్షణలు నంద్యాలను మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా భూమా, శిల్పా కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణ ఉద్రిక్తతలకు కారణమైంది.


          పోలింగ్ ముగుస్తున్న దశలో ఎన్నిక ప్రశాంతంగా సాగిందని భావిస్తున్న క్రమంలో ఆత్మకూరు బస్టాండ్ వద్ద శిల్పా, భూమా కుటుంబాలు ఎదురుపడ్డాయి. ఈ దశలో అనుచరుల మధ్య తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానగా మారింది. శిల్పా చక్రపాణి రెడ్డి, ఆయన కుమారుడు రవితో భూమా నాగిరెడ్డి కుమారుడు జగత్, రెండో కుమార్తె మౌనికా రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.


          ఈ క్రమంలో కొంతమంది అనుచరులు ఘర్షణ పడ్డారు. తోసుకున్నారు. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగింది. అయితే ఇరు కుటుంబాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నాయి. చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: