నారా చంద్రబాబు నాయుడు కాదు ఇక సారా చంద్రబాబు నాయుడే: రోజా




"టిడిపి అనుకూల పత్రిక రోజా జనసేన పార్టీలోకి చేరబోతున్నట్లు" జగన్ తనను మందలించిన విషయం ఉటంకిస్తూ రాసిన వార్తలకు స్పందించిన రోజా ఈ వ్యాఖ్యలు చేసింది. చంద్రబాబు పై రోజా నిశ్చితాభిప్రాయాలు.  సాంఘిక సంక్షేమ పథకాలపై ప్రభుత్వంపై నాయకత్వంపై తనకున్న అంతర్లీన భావాలను ప్రశ్నలను వెల్లడించింది మరోసారి.  


*నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. 
*మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇచ్చేస్తున్నారు.
*ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. 
*కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోంది. 
*మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేశ్‌ వాటా ఎంత?
*నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోండి. 
*స్కూళ్లను మూసి బార్లను తెరవడమే విజనా?
*సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉంది లోకేష్‌ సవాల్‌


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నారావారి నరకాసుర పాలనలో ఆడవారికి రక్షణ లేకుండా పోయిందని ఆమె ధ్వజమెత్తారు. హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆర్కే రోజా శనివారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘ధనార్జనే లక్ష్యంగా మద్యం పాలసీ చేశారు. మద్యం విధానాల వల్ల ఆడవాళ్ల జీవితాలు బలి అవుతున్నాయి. నారా చంద్రబాబు పేరును సారా చంద్రబార్‌ నాయుడిగా మార్చుకోండి. 
 
మంచినీళ్లు ఇవ్వలేదు కానీ మద్యం ఇచ్చేస్తున్నారు. కొత్త మద్యం పాలసీతో ఎన్ని వందల కోట్లు వసూలు చేశారో అర్థం అవుతోంది. మద్యం పాలసీ ద్వారా వచ్చిన దాంట్లో సీఎం, లోకేశ్‌ వాటా ఎంత?. చంద్రబాబు కంటే సిగ్గుమాలిన సీఎం ఎవరైనా ఉంటారా?. తాగుబోతులంతా కూర్చోని తీసుకున్న బార్ల పాలసీ ఇది. స్కూళ్లను మూసి బార్లను తెరవడమే విజనా?. రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా చేస్తున్నారు?. బార్ల పాలసీ వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం తప్పదు.



జయంతి, వర్థంతికి తేడా తెలియని లోకేషా! జగన్‌కు సవాల్ విసిరేది. సింహం ముందు పందికొక్కు తొడ కొట్టినట్లు ఉంది లోకేష్‌ సవాల్‌. ముందు జాతీయ జెండాకు వందనం చేయడం నేర్చుకో లోకేష్‌. ఇక నాపై కొంతమంది పనికిమాలిన వార్తలు రాస్తున్నారు. పనికిమాలిన టీడీపీ లోకి, తలా తోక లేని జనసేన లోకి వెళ్లను. నా ప్రాణం ఉన్నంతవరకూ వైఎస్‌ఆర్‌ సీపీ లోనే ఉంటా అని రోజా స్పష్టం చేశారు.


వైసీపీ ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా పార్టీ మారతారంటూ కొద్దిరోజులుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే ఈ ఊహాగానా లన్నింటికీ తెరదించుతూ తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు జగన్ మోహన్‌రెడ్డి నాయకత్వాన్ని వదిలిపెట్టబోనని రోజా స్పష్టం చేశారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని, తనకు రాజకీయంగా విలువఇచ్చి, అవకాశం ఇచ్చి, తన స్థాయిని పెంచిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడబోనని ఎమ్మెల్యే రోజా సోషల్‌మీడియాలో ప్రకటించారు. వైసీపీ అధినేత జగన్ మందలించడం తో రోజా మన స్థాపం చెందారని, దీంతో ఆమె జనసేన లోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: