పాకిస్థాన్ ప్రతిష్ఠకు అంతర్జాతీయంగా దిమ్మతిరిగి బొమ్మ కనపడబోతుందా..!



కపటాలు కుయుక్తుల తో మోసాలు చేయటం, అంతర్జాతీయ వ్యవస్థల నుందు కూడా నిశ్శిగ్గుగా అబద్దాలు ఆడటం, ఇరుగు పొరుగు దేశాలకు ఉగ్రవాదం సరపరా చేయటం, దొంగతనంగా చొరబాట్లు చేయటం, పగ తీర్చుకోవటానికి కపట మాయోపాయా లు పన్నటం, శత్రుదేశం శత్రువులతో మైత్రి నెరిపి తగని పనులు చేయటం, ప్రజలకోసం దేశ రక్షణ కోసం నిర్మించబడ్డ ఐ.ఎస్.ఐ లాంటి వ్యవస్థలని విదేశాల్లో ఉగ్రవాదాన్ని పెంచటానికి పోషించటానికి ఉగ్రవాద కార్యక్రమాలని నిర్వహించటానికి వాడే దేశమేదైనా ఉందీ అంటే అది పాకిస్థానే అయివుంటుందని ఢంకా భజాయించి చెప్పొచ్చు. పాపం పండినప్పుడు ఇలాంటి వారికి జరగవలసిన గుణపాఠం జరిగినా సిగ్గూ ఎగ్గూ ఉండవు.


ఇప్పుడు పాకిస్తాన్‌కుధారుణమైన మరియు అత్యంత భారీ ఎదురుదెబ్బ తగిలింది. భారత మాజీ నావికాదళ అధికారి కుల్‌భూషణ్‌ జాదవ్‌ను తమ పాకిస్థాన్ లోనే అరెస్ట్‌ చేశామని  చెబుతున్న పాకిస్తాన్‌ మాటలు మొత్తం అబద్దమని తేలిపోయింది. జాదవ్‌ ను ఇరాన్‌లో పట్టుకున్నామని పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ, మాజీ అధికారి, రిటైర్డ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ అంజాద్‌ షోయబ్‌ వెల్లడించారు. జాదవ్‌ ను తమ దేశంలో అరెస్ట్‌ చేయలేదని ఆయన తెలిపారు.


జాదవ్‌ ని బలూచిస్తాన్‌ లో అరెస్ట్‌ చేసినట్టు పాకిస్తాన్‌ చెబుతూ వస్తోంది. అతను ఇరాన్‌ నుంచి తమ దేశంలోకి చొరబడుతుండగా 2016 మార్చి 3 న బలూచిస్తాన్‌ లోనే అరెస్ట్‌ చేసినట్టు పలుమార్లు చెప్పటమే కాకుండా అంతర్జాతీయ న్యాయస్థానము (ఐ సి జె)లోకూడా వాదించింది. ఐఎస్‌ఐ మాజీ అధికారి ప్రకటనతో దాయాది దేశానికి దిమ్మ తిరిగి బొమ్మ కనిపించటమే కాదు ప్రపంచ వ్యాపతంగా పరువు పోగొట్టుకుంది. 


నావికాదళం నుంచి పదవీ విరమణ చేసి ఇరాన్‌లో స్వంత వ్యాపారం చేసుకుంటున్న జాదవ్ ను కిడ్నాప్‌ చేసి అతడిపై పాక్‌ గూఢచర్యం ఆరోపణలు మోపిందని భారత్‌ పేర్కొంది.


మరోవైపు కుల్‌భూషణ్‌ జాదవ్‌ కేసుపై త్వరగా విచారణ చేపట్టాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని(ఐసీజే) పాకిస్తాన్‌ స్వయంగా అభ్యర్థించింది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ కు పాక్‌ మిలటరీ కోర్టు విధించిన మరణశిక్షపై అంతర్జాతీయ కోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. తుది తీర్పు వచ్చేంతవరకు శిక్ష అమలు చేయవద్దని పాకిస్తాన్‌కు ఐసీజే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో త్వరగా విచారణ చేపట్టాలని పాక్‌ కోరుతోంది. 


ఈ పరిస్థితుల్లో ఐ ఎస్ ఐ మాజీ అధికారి అంజాద్‌ షోయబ్‌ వెల్లడించిన  విషయం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: