పూరి జగన్నాధ ఆలయం లో మమత బెనర్జీకి అవమానం



"జన్మతాః నేను హిందువును. అయితే హిందువులను అపఖ్యాతిపాలుచేసే బీజేపీ తరహా హిందూత్వ వాదిని మాత్రం కానని ఆ తరహా హిందువును ఏనాటికి కాలేనని ఎట్టిపరిస్థితుల్లో బీజేపీ ని సహించ బోను" అని అన్నారు.  పశ్చిమ బంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,  బుధవారం ఆమె పూరి లోని ప్రఖ్యాత జగన్నాథ దేవాలయాన్ని దర్శించుకున్నారు. బెంగాలీలకు పూరి జగన్నాథుడంటే అమితమైన నమ్మకమని, ఏటా పూరికి వచ్చే భక్తుల్లో బెంగాలీలూ పెద్ద సంఖ్యలో ఉంటారని గుర్తుచేశారు.తన ఆలయ ప్రవేశంపై బీజేపీ, దాని అనుబంధ సంఘాలు రచ్చచేయడంపై మమత తీవ్రస్థాయిలో మండిపడ్డారు.


పూరి జగన్నాథ ఆలయంలో పూజల అనంతరం సర్క్యూట్‌ హౌస్ లో విలేకరులతో మాట్లాడిన మమత, "బీజేపీ కార్యకర్తలు ఇష్టం వచ్చింది చేసుకోవచ్చు. నాకు మాత్రం జగన్నాథుడి పట్ల విశ్వాసం ఉంది" అని వ్యాఖ్యానించారు. హిందూ మతం చాలా గొప్పదని, అందరినీ కలుపుకునే తత్వం దాని లో ఉందని మమత అన్నారు. రామకృష్ణ పరమహంస శిష్యుడు  స్వామి వివేకానంద హిందూ మతఖ్యాతిని ఖండాంతరాలకు తీసుకెళ్లారని గుర్తుచేశారు.




పూరి జగన్నాథ ఆలయ దర్శనం కోసం మంగళవారం ఒడిశా వచ్చిన మమతకు వ్యతిరేకంగా బీజేపీ యువ మోర్ఛా పెద్ద ఎత్తు న ఆందోళనలు నిర్వహించింది. గతంలో "హిందువులు కూడా గొడ్డు మాంసం తినొచ్చు"  అన్న మమత వ్యాఖ్యలకు వ్యతి రేకంగా బీజేపీ ఈ నిరసన చేపట్టింది. గోమాంస భక్షణను సమర్థించిన మమతను ఆలయం లో అడుగుపెట్ట నియ్యబోమని పూరి సహా పలు ప్రాంతా ల్లో బీజేపీ కార్యకర్తలు ఆందోళనలు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఎక్కడికక్కడ బీజేపీ నేతల ను అరెస్టులు చేశారు. రాష్ట్ర అతిథిగా విచ్చేసిన బెంగాల్‌ ముఖ్యమంత్రి కోసం ఒడిశా సర్కారు భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది.


దేశం లోని వివిధ రాష్ట్రాల్లో కొన సాగుతున్న ప్రాంతీయ పార్టీలు ఇంకా ఎంతో బలపడాల్సిన అవ సరం ఉందని మమతా బెనర్జీ అన్నారు. ఆయా పార్టీలు ప్రాంతీయంగా బలంగా ఉంటూనే జాతీయ స్థాయిలో కలిసి కట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. తద్వారా సమాఖ్య వ్యవస్థ మరింత బలపడు తుందని చెప్పారు.

 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: