ఏపీ: సీఎంగా పవన్ వద్దు.. మరి లోకేష్ సంగతి..?
అయితే చిన్న వయసులోనే వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డి సీఎం గా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ ఇప్పుడు మరి నారాలోకేష్ పరిస్థితి ఏంటా అని చర్చనీయాంశంగా మారింది.. 2019లో రెండవసారి టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చి ఉంటే సీఎంగా అయ్యే వారిని అప్పట్లో పెద్దదూమారం కొనసాగింది. ఇప్పుడు 2024 టిడిపి కూటమిలో అధికారం వచ్చినప్పటికీ బంపర్ మెజారిటీతో గెలిచిన సీఎంగా చంద్రబాబు కొనసాగుతున్నారు. త్వరలోనే జమిలి ఎన్నికలు రాబోతున్నాయనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి.. ఒకవేళ టిడిపి కూటమిగా మళ్లీ గెలిస్తేనే లోకేష్ ని సీఎంగా చేయబోతున్నారనే ప్రచారం కూడా ఇప్పుడు కొనసాగుతోంది.
2027 జెమిలి ఎన్నికలు వచ్చి కూటమే మళ్లీ ఈ ప్రభుత్వమే గెలిస్తేనే లోకేష్ సీఎం అని టిడిపి నేతలు కార్యకర్తలు మాట్లాడుకుంటున్నారట. చంద్రబాబు కూడా ఒకవేళ ఈసారి ఎన్నికలలో కూటమి గెలిస్తే తన కుమారుడిని సీఎంగా చూడాలని కలలు కంటున్నారు. అందుకు తగ్గట్టుగా లోకేష్ ని తయారు చేస్తున్నారు సీఎం చంద్రబాబు. అందుకే ఎన్నికల ముందు యువగళం అనే పేరుతో ర్యాలీలు వంటివే కాకుండా అమెరికా వంటి టూర్ల వాటిలో కూడా లోకేష్ ని యాక్టివ్ గా ఉంచేలా చేస్తున్నారు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా 2039 వరకు చంద్రబాబు అంటే ఇక లోకేష్ ఎప్పటికీ సీఎం కాలేరా అనే విధంగా ఆయన అభిమానులు మాట్లాడుకుంటున్నారట. అయితే ఇప్పటివరకు లోకేష్ ఈ విషయం పైన క్లారిటీ అయితే తెలియజేయలేదు. మరి రాబోయే ఎన్నికలలో ఎవరు గెలుస్తారు ఎవరు అధికారం చేపడతారో చూడాలి.