కొడంగల్ దెబ్బకు.. వికారాబాద్ కలెక్టర్ కు ఎమ్మెల్సీ పదవి ?
గత వారం రోజుల కిందట... వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్.. గారి చేత సర్వే చేయించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయం తీసుకోండి. దీంతో గత వారం రోజుల కింద కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లకు వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ వెళ్లారు. అయితే వికారాబాద్ కలెక్టర్ అక్కడికి రాగానే... రైతులు, ప్రతిపక్ష పార్టీ నేతలు, గ్రామ ప్రజలు... తిరుగుబాటు బావుట ఎగరవేశారు. కలెక్టర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కొంతమంది మహిళలు కలెక్టర్ను కొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో కలెక్టర్కు గాయాలు కూడా అయ్యాయని వార్తలు వచ్చాయి. దీంతో చాకచక్యంగా అక్కడి నుంచి బయటపడ్డారు కలెక్టర్. అయితే కలెక్టర్ పై దాడి తర్వాత అక్కడ ఉన్న కార్లను కూడా ధ్వంసం చేశారు లగచర్ల గ్రామం ప్రజలు. దీంతో అర్ధరాత్రి 300 మంది పోలీసులు ఆ గ్రామానికి చేరుకొని... దాదాపు 70 మంది రైతులను అరెస్టు చేశారు. ప్రస్తుతం వీరందరూ జైల్లోనే ఉన్నారు.
అయితే ఈ ఘటన వెనుక ఉన్న.. అసలు సూత్రధారి గులాబీ పార్టీకి చెందిన సురేష్ పరారీలో ఉన్నాడు. పట్నం నరేందర్ రెడ్డి కూడా అరెస్ట్ కావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.. వికారాబాద్ కలెక్టర్ చాలా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నేతలు అంటున్నారు. ఆయనే దగ్గరుండి అరెస్టులు చేయిస్తున్నారని అంటున్నారు. కలెక్టర్కు రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని... అందుకే ఇలా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు..
గతంలో సిద్దిపేట కలెక్టర్గా పనిచేసిన వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. అప్పుడు ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని... ఎమ్మెల్సీ పదవి ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఇక ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్... అనుకూలంగా వ్యవహరిస్తున్నారని.. ఆయనకు కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని అంటున్నారు. మొత్తానికి ఈ వివాదంలో వికారాబాద్ కలెక్టర్ విలన్ గా మారారు.