మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుపై సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో మాదిరిగా ఏపీలోనూ ఆడపడుచులకు కానుకగా అతి త్వరలోనే అందించనున్నారు. గత నెల 13న సీఎంగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఐదు హామీల అమలుపై సంతకాలు చేసిన చంద్రబాబు.. సూపర్ సిక్స్లో భాగంగా మహిళా శక్తి పేరిట ప్రకటించిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడంపై రంగం సిద్ధం చేస్తున్నారు. మహిళల పాలిట వరంలా మారిన ఈ పథకాన్ని పొరుగు రాష్ట్రాల్లో బాలికలు, విద్యార్థినులు, థర్డ్ జెండర్లు భారీ ఎత్తున సద్వినియోగం చేసుకుంటున్న విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో ఉచిత బస్సు ప్రయాణం పై తాజాగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతిలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేయవచ్చని వెల్లడించారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెంచిన పింఛన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అదే విధంగా సంక్రాంతి లోపల ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణం చేసే విధంగా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు.
కూటమి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకొస్తుందన్నారు. ఈ క్రమంలో గత ప్రభుత్వం మంత్రి జనార్ధన్ రెడ్డి గత ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. తల్లికి చెల్లికి న్యాయం చేయలేని జగన్.. చంద్రబాబు ప్రభుత్వం పై మాట్లాడే అర్హత లేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు అని ఆయన పేర్కొన్నారు.ఇదిలావుండగా 'ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన.. ఏడాదికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని శ్రీకాకుళం జిల్లా, ఈదుపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉచిత వంటగ్యాస్ సిలిండర్ అందుకున్న మహిళల కళ్లలో ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈదుపురంలో ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకున్న శాంతమ్మ, నేను గతంలో ప్రవేశ పెట్టిన దీపం 1 స్కీమ్ లో గ్యాస్ కనెక్షన్ అందుకున్న మహిళ అని తెలియడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది' అని చంద్రబాబు పోస్ట్ చేశారు.