కాలికి కట్టుతో కనిపించిన బిగ్ బాస్ నటి.. ఆందోళనల ఫ్యాన్స్..!
దివి తన కాలుకి కట్టు కట్టుకున్నప్పటికీ దానిపైన స్కెచ్ తో రాసుకుంటూ బొమ్మలు కూడా వేసుకుంటూ ఉన్నట్టు కనిపిస్తోంది. అందుకు సంబంధించి ఇంస్టాగ్రామ్ లో కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. ఇందుకు కొటేషన్ గా ఇలా రాసుకుంటూ "కొన్నిసార్లు మన పనిని కాలు మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఆపివేస్తుందని.. కానీ ఎంటర్టైన్మెంట్ అనేది మనం ఎందుకు ఆపాలి అందుకే కట్టుని నాకు అడ్డంకిగా చూసుకోకుండా బొమ్మలు గీస్తు చాలా అందంగా తయారు చేస్తున్నానని.. జీవితం అంటేనే కష్టాలను తప్పించుకోవడం కాదు ఇలాంటి సమయాలలో కూడా మనం నవ్వుతూ ఉండాలి అందుకే తాను ఇక్కడ ఉన్నాను తన ప్రతి సెకండు కూడా ఆస్వాదిస్తాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు అంటూ ఒక పోస్ట్ షేర్ చేసింది".
దీంతో ఈ ఫోటో చూసిన అభిమానులు నేటిజెన్సీ సైతం దివి కాలికి ఏమైంది? ఎందుకు అంత పెద్ద కట్టు కట్టారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది ఇకనైనా జాగ్రత్తగా ఉండండి రెస్టు తీసుకోండి అంటూ ఆమెకు సపోర్టుగా కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించిన నటి దివి బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత పలు చిత్రాలలో హీరోయిన్గా కూడా నటించింది అలాగే ఎన్నో వెబ్ సిరీస్లలో కూడా నటించింది.