తిరుమలలో చిరుతల బెడద.. పెద్ద ప్రాబ్లం గా మారింది..
* తరచుగా కనిపిస్తూ కలకలం
* వీటి సమస్యలకు పరిష్కారమే లేదా
(ఏపీ - ఇండియా హెరాల్డ్)
కొన్ని నెలల క్రితం నుంచి తిరుమలలో శ్రీవారి భక్తులను చిరుతల భయం పట్టుకుంది. అలిపిరి నడకమార్గంలో చిరుతలు ప్రవేశిస్తున్నాయి. భక్తులను కాపాడటానికి టీటీడీ, అటవీ శాఖ అధికారులు చాలానే చర్యలు చేపడుతున్నారు. అయినా చిరుతల బెడద తప్పడంలేదు. కొన్ని నెలల క్రితం అలిపిరి నడక మార్గంలో చిరుత కనిపించడంతో భక్తులు భయంతో వణికిపోయారు. నడకమార్గంలోని నరసింహస్వామి ఆలయం వద్ద ఈ చిరుత కనిపించింది. 7 రోజులుగా ఇదే ప్లేసులో చిరుత కనిపించింది. తర్వాత నడకదారిలో భక్తులు గుంపులుగా వెళ్లాలని టీటీడీ, అటవీ శాఖ అధికారులు సూచించారు. రీసెంట్ టైమ్‌లో ఈ నడకమార్గంలో ఏకంగా ఐదు చిరుతలను ఫారెస్ట్ అధికారులు బంధించారు.
అయినా ఇంకా ఎక్కువ చిరుతపులులు అక్కడ కనిపిస్తూ బెంబేలెత్తిస్తున్నాయి. ఇవి భక్తులపై దాడులు కూడా చేస్తున్నాయి. చిరుతలు చిన్నారులు, పెద్దవారిపై దాడి చేయడం, వారిని ఎత్తుకెళ్లి చంపిన దిగ్బ్రాంతికర ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కొంతకాలం క్రితం ఓ ఆరేళ్ల చిన్నారిపై చిరుత దాడి చేసి ఆమెను చంపేసింది. ఈ ఘటన చాలామందిలో విషాదాన్ని నింపింది. అప్పటినుంచి నడకదారిలో వెళ్లాలంటేనే భక్తులు గుండెల్లో వణుకు పుడుతోంది. చిరుతల వరుస దాడులతో భక్తులు తీవ్ర భయాందోళనకు గురువుతున్నారు. వీటివల్ల తిరుమలకు నడక మార్గం ద్వారా వెళ్లే భక్తుల సంఖ్య తగ్గుతోంది. భక్తులు లేక తిరుమల నడక మార్గం బోసిపోతోంది.
సాధారణ రోజుల్లో నడకదారుల్లో వెళ్లే భక్తుల సంఖ్య 30 నుంచి 35 వేలు ఉండగా ఒకానొక సమయంలో కాలి నడకన తిరుమలకు వెళ్లే భక్తుల సంఖ్య 19 వేలకు తగ్గింది. ఇదిలా ఉంటే మరోవైపు తిరుమలకు కార్లు, బస్సులు, సుమోల్లో వెళ్లే భక్తుల సంఖ్య రెట్టింపు అవుతోంది. ఇదిలా ఉంటే రీసెంట్ టైమ్ లో మరో చిరుత బోనులో చిక్కింది. ఈ చిరుతల సమస్య వైసీపీ కాలంలో బాగా పెరిగిపోయింది. చంద్రబాబు వచ్చాక కూడా ఈ సమస్య భక్తులను వేధిస్తోంది.