షర్మిల: ఏపీ సీఎం ఢిల్లీ టూర్ పై ఘాటు వ్యాఖ్యలు..!

Divya
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెలలోనే రెండుసార్లు ఢిల్లీకి వెళ్లిన పరిస్థితి ఏర్పడింది.. అక్కడ కేంద్ర పెద్దలను కలుస్తూ రాష్ట్రానికి భారీగా నిధులు కావాలి అంటూ అభివృద్ధి సహాయం చేయాలి అంటూ కేంద్ర మంత్రులను పదేపదే విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు హస్తిన పర్యటనల పైన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ వైయస్ షర్మిల తీవ్రంగా ఫైర్ అయ్యింది.. అంతేకాకుండా చంద్రబాబును ఉద్దేశించి పలు రకాల ప్రశ్నలు కూడా ఏపీ సీఎం పైన ప్రశ్నించడం జరిగింది.

ముఖ్యంగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి ముఖ్యమంత్రి చంద్రబాబు అంటూ హిత బోధ చేస్తోంది. అయినను పోయి రావాలి హస్తి నాకు అన్నట్టుగా ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తీరు ఉంది అంటూ షర్మిల విమర్శించడం జరిగింది..NDA కూటమిలో పెద్దన్న పాత్రగా ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు... కేవలం ఢిల్లీ చుట్టూ మాత్రమే తిరుగుతున్నారు అంటూ ఆమె ప్రశ్నించింది?.. అలాగే ముక్కు పిండి విభజన సమస్యలను పరిష్కరించాల్సింది పోయి బిజెపి పెద్దలకు సలాం కొడుతూ తిరుగుతున్నావు అంటూ ఫైర్ అయ్యింది.

కేంద్రంలో రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి ఇప్పటికి నెలరోజులు అవుతూ ఉన్న అటు మోడీ గాని ఇతర మంత్రులతో కానీ కనీసం ఒక్క హామీ ఎందుకు ప్రకటించడం లేకపోయారు అంటూ ఆమె ప్రశ్నించింది?.. గెలిచిన రోజు నుంచి ఇప్పటికి  నాలుగు సార్లు ఢిల్లీకి వెళ్లి వచ్చారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఒక ప్రకటన కూడా తీసుకురాలేదు అంటూ ఆమె ఫైర్ అయ్యింది. విశాఖ ఉక్కు ప్రైవేటు కరణం కాదు అంటూ కేంద్రమంత్రి పెద్దలతో చెప్పించగలరా అంటూ ఆమె ప్రశ్నించింది?. అలాగే పోలవరం ప్రాజెక్టుల పైన, రాజధాని నిర్మాణం పైన సహాయమేంటో చెప్పగలిగారా అంటూ ఆమె ప్రశ్నిస్తోంది?.. ఒడ్డు దాటేదాకా ఓడ మల్లన్న దాటేశాక బోడి మల్లన్న అనే పరిస్థితి ఏర్పడింది అంటూ తెలిపారు. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి అంటూ ఆమె హితబోధ చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: