సింహం నిజంగా అడవికి రాజేనా.. ఈ వీడియో చూస్తే మీక్కూడా డౌట్ వస్తుంది?

praveen
సాధారణంగా అడవి అనే ప్రపంచంలో ఒక జంతువుకు ఆకలి వేసిందంటే ఇంకో జంతువుకు ఆయువు మూడినట్టే ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే ఒక జంతువు కడుపు నింపుకొని బతుకును సాగించాలి అంటే ఇంకో జంతువును వేటాడాల్సిందే. అయితే అడవి అనే ప్రపంచంలో రారాజు ఎవరు అంటే ప్రతి ఒక్కరు కూడా సింహం అనే చెబుతూ ఉంటారు. ఎవరో చెప్పడం కాదు ఏకంగా మనం చదువుకున్న కథల్లో కూడా ఇదే చూసాము. ఇక అడవిలో ఉండే ఎంతటి జంతువు అయినా సరే సింహం కంటపడింది అంటే భయపడి వెనకడుగు వేయాల్సిందే. ఎందుకంటే ఎలాంటి జంతువునైనా సరే సింహం ఎంతో అలవోకగా వేటాడి ఆహారంగా మార్చుకోగలదు.

 ఒక్కసారి సింహం కన్ను పడింది అంటే చాలు దాని వేట నుంచి తప్పించుకోవడం అసాధ్యం అనడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి సింహం అడవిలో ఉంటే ఎంతటి భారీ ఆకారం కలిగిన జంతువునైనా సరే భయపెట్టగలదు. కానీ ఇక్కడ మాత్రం ఏకంగా సింహమే భయపడిపోయింది. సాధారణంగా సింహం సేద తీరుతున్న సమయంలో ఎంత పెద్ద జంతువు అటువైపుగా వస్తున్న.. అసలు జంకవు ఆ పెద్ద ఆకారంలో ఉన్న జంతువులే భయపడి పక్క నుంచి వెళ్లిపోవాలి తప్ప సింహం మాత్రం అక్కడి నుంచి ఒక్క ఇంచ్ కూడా పక్కకు జరగదు. కానీ ఇక్కడ మాత్రం సింహాలు ప్రవర్తించిన తీరు చూస్తే.. నిజంగా సింహం అడవికి రారాజేనా అనే భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంది.

 ఏకంగా రెండు భారీ సింహాలు ఒకచోట సేద తీరుతూ ఉండగా.. ఇంకో జంతువు అటువైపుగా రాగా.. ఏకంగా సింహం పిల్లి మాదిరిగా తోకముడిచి తామున్న ప్రాంతం నుంచి జారుకున్నాయి. రెండు సింహాలు ఓ ప్రాంతంలో కూర్చొని సేద తీరుతున్నాయి. ఆ సమయంలోనే రెండు ఖడ్గమృగాలు అటుగా వచ్చాయి. అయితే వాటిని చూసిన సింహాలు వెంటనే లేచి పక్కకు వెళ్లిపోయాయి. ఖడ్గమృగాలు కాసేపు అదే ప్రాంతంలో ఉండడంతో రెండు మగసింహాలు తోకముడిచి అక్కడ నుంచి దూరంగా వెళ్లిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఈ వీడియో చూసి నెటిజెన్స్ కూడా షాక్ అవుతున్నారు. సింహాలు ఏంటి ఇలా ప్రవర్తించడం ఏంటి మొదటిసారి చూస్తున్నాం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: