బాలయ్య వింటేజ్ లుక్ అదుర్స్.. ఎమన్నా వున్నాడా అస్సలు..!!

murali krishna
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరో గా ప్రస్తుతం తన కెరీర్ 109వ సినిమా దర్శకుడు కొల్లి బాబీ తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం ఇప్పుడు శరవేగం గా షూటింగ్ పూర్తి చేసుకుంటుండ గా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం బాలయ్య రెండు మూడు లుక్స్ ని ప్రిపేర్ చేశారు కానీ తాజాగా నాలుగో లుక్ ఒకటి ఫ్యాన్స్ కి ఊహించనై ట్రీట్ ఇచ్చింది.అయితే ఇందులో బాలయ్య మళ్ళీ తన చెన్నకేశవరెడ్డి, నరసింహా నాయుడు రోజుల్లో తరహాలో వింటేజ్ లుక్స్ తో అదరగొట్టారు. కానీ ఈ లుక్ అయితే సినిమా లో లేదు అన్నట్టు తెలుస్తుంది. ఇది కేవలం ఒక యాడ్ షూటింగ్ కోసం మాత్రమే ప్రిపేర్ చేసింది అని టాక్. ఒకవేళ ఈ లుక్ కానీ సినిమా లో ఉండుంటే ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ వచ్చి ఉండేది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం లో ఊర్వశి రౌటేలా, బాబీ డియోల్ తదితరులు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు.ఇదిలావుండగా తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణను ఘనంగా సన్మానించేందుకు టాలీవుడ్ సిద్దమైంది. నందమూరి బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలు పేరిట అంగరంగ వైభవంగా , అత్యంత ఘనంగా వేడుక నిర్వహించడానికి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తుంది. ఈ వేడుకను సెప్టెంబర్ 1న హైదరాబాద్‌లోని నోవోటెల్ హైటెక్స్‌ లో సాయంత్రం 6 గంటల నుంచి వైభవం గా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ వేడుకకి సంబంధించిన ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ గ్రాండ్ ఈవెంట్ కు సినీ పరిశ్రమలోని ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు, ఇతర సెలబ్రెటీలు హాజరు కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: