పుష్ప గాడి వేటకి ఇంకా 100 రోజులే సమయం.. రూల్ చేస్తాడా.. చతికలబడతాడా..?

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2: ది రూల్’ చిత్రానికి క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కోసం సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో గ్రాండ్ స్కేల్‍లో ఈ సీక్వెల్ మూవీ రూపొందుతోంది. ఆగస్టు నుంచి డిసెంబర్ 6వ తేదీకి ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. దీంతో మరో 100 రోజుల్లో పుష్ప 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 'పుష్ప 2: ది రూల్' 100 రోజుల్లో వచ్చేస్తోందంటూ ఈ మూవీ టీమ్ఆగస్టు 28అప్‍డేట్ ఇచ్చింది. కౌంట్‍డౌన్ పోస్టర్ తీసుకొచ్చింది. ఇతడి రూల్‍ను మరో 100 వంద రోజుల్లో చూడండి అంటూ అల్లు అర్జున్ ఉన్న పోస్టర్ రివీల్ చేసింది.“పుష్ప 2: ది రూల్ సినిమా కోసం మరో 100 రోజులు ఉంది. ఐకానిక్ బాక్సాఫీస్ ఎక్స్‌పీరియన్స్ కోసం రెడీ ఉండడం. పుష్ప 2 ది రూల్.. డిసెంబర్ 6న థియేటర్లలోకి వస్తోంది” అని మైత్రీ మూవీ మేకర్స్ పోస్ట్ చేసింది. దీంతో మళ్లీ వాయిదా పడుతుందన్న రూమర్లు మేకర్స్ మరోసారి చెక్ పెట్టేశారు. పుష్ప 2 చిత్రీకరణ విషయంలో హీరో అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ మధ్య విభేదాలు వచ్చాయంటూ కొంతకాలంగా రూమర్లు వస్తూనే ఉన్నాయి. షూటింగ్ అందుకే ఆలస్యమవుతోందని, మళ్లీ వాయిదా పడుతుందనే ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఇటీవల మారుతీ నగర్ సుబ్రమణ్యం సినిమా ఈవెంట్‍కు అల్లు అర్జున్, సుకుమార్ కలిసి హాజరవటంతో ఈ రూమర్లకు చెక్ పడింది.
డిసెంబర్ 6న వస్తున్నామంటూ ఆ ఈవెంట్‍లో అల్లు అర్జున్ ఫుల్ జోష్‍తో చెప్పారు. అసలు తగ్గేదెలే అంటూ పుష్ప ఐకానిక్ డైలాగ్ చెప్పారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మూవీ చేసినందుకు ఆలస్యమైందని సుకుమార్ అన్నారు. అంచనాలను ఈ మూవీ చేరుకుంటుందని తెలిపారు. ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ పుష్ప 2 చిత్రం డిసెంబర్ 6వ తేదీకి వాయిదా పడింది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సెప్టెంబర్‌లోనే షూట్ పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పాటలు వచ్చాయి. నేషనల్ వైడ్‍గా ఈ రెండు సాంగ్స్ పాపులర్ అయ్యాయి. ఈ మూవీకి దేవీ శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.2021లో వచ్చి పాన్ ఇండియా రేంజ్‍లో బంపర్ హిట్ అయిన పుష్ప ది రైజ్‍కు కొనసాగింపుగా పుష్ప 2 వస్తోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీస్థాయిలో ఉన్నాయి. అందుకే తగ్గట్టే సుమారు సుమారు రూ.400కోట్ల బడ్జెట్‍తో తెరకెక్కుతోందనే అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేనీ, యలమంచలి రవిశంకర్ ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగదీప్ ప్రతాప్ భండారీ, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్ కీరోల్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: