సూర్య హీరోగా నటించిన కంగువా సినిమాపై డివైడ్ టాక్ రావడంతో మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్ 14న విడుదలైంది.సుమారు రూ. 350 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటి వరకు కేవలం రూ. 160 కోట్ల వరకు రాబట్టినట్లు తెలుస్తోంది. కంగువా మొదటి అరగంట అనుకున్న స్థాయిలో లేదని ప్రేక్షకులు చెప్పిన మాట నిజమేనని జ్యోతిక కూడా తెలిపింది. సినిమా ప్రారంభమే కాస్త బోర్గా ఉండటంతో కంగువాపై భారీ ప్రభావం చూపిందని చెప్పవచ్చు.కంగువా చిత్రం రెండో భాగం చాలా బాగుందని రివ్యూస్ వచ్చాయి.ఇదిలావుండగా ఈ మధ్య హీరో సూర్య భార్య జ్యోతిక తన సోషల్ మీడియా ద్వారా ఈ సినిమా రివ్యూ ఇచ్చింది. అది ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఆ పోస్ట్ పై వివాదాస్పద సింగర్ సుచిత్ర స్పందించింది. జ్యోతిక పై దారుణమైన కామెంట్స్ చేసింది. ప్రస్తుతం ఇది సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతుంది..
కంగువ సినిమా కథ సరిగ్గా లేదని, బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. సూర్య ఫ్యాన్స్ ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. తాజాగా ఈ మూవీ పై ఆయన భార్య జ్యోతిక పాజిటివ్ గా స్పందించింది. సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది. ఆ పోస్టు లో ఏమి రాసి ఉందంటే.. నేను సూర్య భార్యగా దీన్ని రాయడం లేదు. నేను సినీ అభిమానిగా జ్యోతికగా రాస్తున్నాను. సినిమా మొదటి అరగంట వర్కవుట్ కాలేదు. సౌండ్ సరిగా లేదు. అదే సమయంలో, లోపాలు చిత్రంలో భాగం. పూర్తి మూడు గంటలలో మొదటి అరగంట బాగాలేదు. ఏది ఏమైనప్పటికీ, ఇది మంచి సినిమా అనుభవం. తమిళ సినిమా మునుపెన్నడూ చూడని కెమెరా పనితనంలో సినిమాటోగ్రాఫర్ సక్సెస్ అయ్యాడు. మీడియా, కొంతమంది నుండి ప్రతికూల సమీక్షలు నన్ను ఆశ్చర్యపరుస్తాయి. ఆడవాళ్ల పై డబుల్ మీనింగ్ డైలాగులతో ఉన్న సినిమాలకు కూడా ఇంత నెగిటివ్ రివ్యూలు రాయలేదు దీనికి రాయడం భాదాకరం.ఇదే నాకు బాధగా అనిపించింది అని పోస్ట్ చేసింది. ఆ పోస్ట్ పై సినీ ప్రముఖులు సైతం స్పందిస్తున్నారు.
తాజాగా ఈ పోస్ట్ పై వివాదాస్పద సింగర్ సుచిత్ర స్పందించింది. మొదటి అరగంట పర్వాలేదని చెప్పిన జ్యోతిక.అరగంట తర్వాత సినిమాకి రమ్మని అడిగిందా.ఇందులో లాజిక్ ఏంటి? ఆమె కంగువా గురించి అర్ధంలేని పోస్ట్ చేశారు. ఇప్పటికే సినిమా ఆగిపోయింది. జ్యోతిక తన వంతుగా మరింత పడిపోయింది. అది తప్పుడు చిత్రమని తేలింది. సూర్య మంచి నటుడే కానీ ఇలా అపద్దం చెప్పి జనాలను మోసం చెయ్యాలినా అని ఓ రేంజులో ఫైర్ అయ్యింది. కంగువాలో సూర్య నటనను ఎవరు మెచ్చుకోలేదు.ప్రయత్నం చేయలేదని ఎవరైనా విమర్శిస్తారా. జ్యోతికకు పెద్దగా అక్షరాస్యత లేదు. సినిమాటోగ్రాఫర్ విజయానికి ఎందుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన తదుపరి చిత్రంలో నటిస్తారా.పర్ఫెక్ట్ సెల్ఫిష్ జ్యోతిక,సూర్యని ఎందుకు పెళ్లి చేసుకున్నావు? ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నావు,నువ్వేం చేస్తున్నావో నీకైనా తెలుసా, సినిమాకు ప్రమోషన్స్ ఇవ్వడం అంటే బ్రా పై కోటు వేసుకొని వెళ్లడం అనుకుంటున్నావా అని బూతులు తిట్టేసింది. ఈమె నోటికి ఎవరు చిక్కినా మటాషే. ఇప్పుడు ఇంత దారుణంగా జ్యోతికను తిట్టింది. దీనిపై జ్యోతిక ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.