టాలీవుడ్ హీరోతో పెళ్లి.. రెండేళ్లకే విడాకులు..కష్టాల్లో హీరోయిన్‌?

Veldandi Saikiran
కీర్తి రెడ్డి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన తొలిప్రేమ సినిమాలో హీరోయిన్ గా నటించి మెప్పించింది. అంతేకాకుండా అక్కినేని హీరో సుమంత్ మాజీ భార్యగా కూడా కీర్తి రెడ్డి ప్రతి ఒక్కరికి సుపరిచితమే. కీర్తి చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికీ తన నటనతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది.

ముఖ్యంగా తొలిప్రేమ సినిమాతో భారీ క్రేజ్ లభించింది. అయితే కీర్తి రెడ్డి ఆలీ హీరోగా నటించిన గన్ షాట్ సినిమాతో వెండితెరకు హీరోయిన్గా పరిచయమైంది. ఈ సినిమాను ఎస్వీ కృష్ణారెడ్డి తెరకెక్కించారు. అనంతరం కరుణాకరన్ దర్శకత్వంలో రూపొందిన తొలిప్రేమ సినిమాతో మంచి గుర్తింపు సాధించింది. కానీ ఈ సినిమాలో నటించిన హీరోయిన్ కీర్తి రెడ్డి పెద్దగా కనిపించలేదు.

ఈ సినిమా తర్వాత కీర్తి రెడ్డి కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అవేవీ సక్సెస్ కాలేకపోయాయి. ఇదే సమయంలో అక్కినేని హీరో సుమంత్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. కొంతకాలం వీరు బాగానే ఉన్నారు. అనంతరం అభిప్రాయ బేధాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. తర్వాత కీర్తి రెడ్డి బెంగళూరుకు చెందిన ఓ ప్రముఖ బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకొని అమెరికాలో స్థిరపడింది. చాలా కాలం తర్వాత ఇండియాకు తిరిగివచ్చింది. ఇటీవలే కీర్తి రెడ్డి ఫ్యామిలీ ఫ్రెండ్ ను కలవడం కోసం హైదరాబాద్ కు వచ్చింది.

దాంతో మరోసారి కీర్తి రెడ్డి వెండితెరపై కనిపించడానికి సిద్ధమైందంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం కీర్తి రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలని అనుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇక ఈ వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా అక్కినేని హీరో సుమంత్ మాత్రం ఇప్పటికి సింగల్ గా ఉన్నాడు. మరో పెళ్లి మాత్రం చేసుకోలేదు అక్కినేని హీరో సుమంత్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: