ఏపీ: విజయసాయిరెడ్డితో వైసీపీ పార్టీకి గొప్ప ఛాన్స్..!
30 ఏళ్ల క్రితం పీవీ నరసింహారావు, అటల్ బిహారి వాజ్ పాయ్ ఐక్యరాజ్యసమితికి ప్రాతినిధ్యం వహించడానికి భారత బృందానికి లీడర్ గా ఎంపిక చేయడం జరిగిందట .అప్పట్లో ఇది చాలా చర్చనీ అంశంగా మారింది. ఎందుకంటే అధికార పార్టీ తరఫునుంచి ప్రాతినిధ్యం వహిస్తారని అనుకున్నప్పటికీ కానీ వివక్ష పార్టీకి అప్పగించడంతో అప్పట్లో కొంతమంది నేతలు నానా హంగామా చేశారట. అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డికి ఐక్యరాజ్యసమితికి వెళ్లే అవకాశం కల్పించడానికి చూస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి వైసీపీ పట్ల ఇంకా బాండింగ్ ఉందని చాలామంది నేతలు గుసగుసలు మాట్లాడుకుంటున్నారు.
ఇక ఇవన్నీ పక్కన పెడితే ఇటీవల ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సైతం సందర్శించిన విజయసాయిరెడ్డి.. అక్కడే మహాత్మా గాంధీ విగ్రహానికి సైతం పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ విషయాన్ని విజయసాయిరెడ్డి తన సోషల్ మీడియా వేదికగా తెలిపారు. మరి వైసీపీ పార్టీ నుంచి విజయసాయిరెడ్డి 79వ ఐక్యరాజ్యసమితి సెషన్ లో పాల్గొనడం గొప్ప గౌరవం అని కూడా పలువురు నేతలు తెలియజేస్తున్నారు. 2016 నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి పార్లమెంటులో కూడా సీనియర్ నేతగానే పేరు సంపాదించారు. మొత్తానికి వైసీపీ పార్టీకి మరొక బూస్ట్ లాంటిది ఇది అని చెప్పవచ్చు.