పుష్ప 2 :ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే సుకుమార్ ఫుల్ సపోర్ట్.. కానీ..?

murali krishna
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2' మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు...ఈ సినిమాను మేకర్స్ డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు . పుష్ప 2  రిలీజ్ కి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో సుకుమార్ టీమ్ మొత్తం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి ఫోకస్ పెట్టింది.. మూవీ విషయంలో ఎలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది..ఈ మూవీతో ప్రేక్షకులకి సరికొత్త అనుభూతుని ఇచ్చేందుకు మూవీ టీం బాగా కష్టపడుతుంది.. పుష్ప సినిమా కంటే భారీ స్థాయిలో అంచనాలు ఉండటంతో ఈ మూవీ కచ్చితంగా 1000 కోట్ల క్లబ్ లో చేరుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. దేశంలోనే హైయెస్ట్ ప్రీరిలీజ్ బిజినెస్ జరిగిన చిత్రంగా 'పుష్ప 2' నిలిచింది..జరిగిన బిజినెస్ కి తగ్గట్లుగానే మూవీ కలెక్షన్స్ వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.

 ఇదిలా ఉంటే గతంలో పుష్ప సినిమాకి దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన సాంగ్స్ అందించడంతో పాటు అదిరిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ సైతం అందించి అందరిని ఎంతగానో మెప్పించాడు. అలాగే 'పుష్ప 2' మూవీకి కూడా దేవిశ్రీ బ్లాక్ బస్టర్ సాంగ్స్ ఇచ్చాడు. ఇప్పటికే రిలీజ్ అయిన రెండు సాంగ్స్ కి ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 

గతంలో వచ్చిన పుష్ప మూవీ సాంగ్స్ ప్రపంచాన్ని ఊపేసాయి..దీనితో పుష్ప 2 సాంగ్స్ పై ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ బాగా పెరిగింది...అయితే ఈ సినిమా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ విషయంలో మాత్రం ఈ సారి దేవిశ్రీ ప్రసాద్ ఒక్కడే చేయడం లేదనే న్యూస్ బాగా వైరల్ అవుతుంది..తమన్ ఈ మూవీ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కోసం వర్క్ చేస్తున్నట్లు ఇప్పటికే కన్ఫర్మ్ చేశాడు. అలాగే తనతో పాటు మరికొంతమంది కూడా బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తున్నారని పరోక్షంగా తెలిపారు. అందరం కలిసి వాట్సాప్ గ్రూప్ లో కనెక్ట్ అవుతూ కమ్యూనికేట్ అవుతున్నామని, ఫైనల్ గా బెస్ట్ అవుట్ పుట్ ఇస్తామని ఆయన అన్నారు..

దీంతో 'పుష్ప 2'కి బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పనిచేస్తోన్న మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరనే ప్రశ్న సోషల్ మీడియాలో తెగ చర్చ నడుస్తుంది.. 
ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న సమాచారం మేరకు అయితే అజనీష్ లోకనాథ్, సామ్ సిఎస్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారని సమాచారం..అయితే సుకుమార్ మ్యూజిక్ విషయంలో దేవిశ్రీకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది.. ఈసినిమా కోసం దేవిశ్రీ ఒక వెర్షన్ మ్యూజిక్ ఇచ్చారు. అలాగే మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే వెర్షన్ ఇచ్చారు.. వీరందరి వెర్షన్ లను పరిశీలించి ఎవరిది బాగుంటే దానిని ఫైనల్ చేయనున్నట్లు సమాచారం.. ముందు నుంచి దేవిశ్రీ కి సపోర్ట్ ఇస్తున్న సుకుమార్ దేవిశ్రీ మ్యూజిక్ కే మొగ్గు చూపనున్నట్లు తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: