మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? అయితే, ప్రోటీన్ లోపం ఉన్నట్లే!

lakhmi saranya
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రోటీన్ లోపం వస్తుంది. ఈ లోపం ఉన్నవారు ప్రోటీన్స్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే మంచిది. శరీరం ఆరోగ్యంగా, పిట్ట ఉండాలంటే పోషకాలు చాలా అవసరం. లేకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్లు, ఖనిజాలు, మినరల్స్ ఏవి తక్కువైనా దాని ప్రభావం శరీరంపై పడుతుంది. శరీర పనితీరుకు సరిపడా ప్రోటీన్లను తీసుకోవటం మంచిది. లేకుంటే ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కొన్ని అనారోగ్యకరమైన ఆహారాలు తినటం వల్ల ప్రోటీన్ లోపం వస్తుంది. దీని కారణంగా శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇది ఇన్ఫెక్షన్లు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం అవుతుంది.
ఆహారం ద్వారానే శరీరానికి ప్రోటీన్లను అందించాలి. రోజులో కావాల్సినంత ప్రోటీన్లు తీసుకోకపోతే అది లోపంగా మారుతుంది. ఈ లక్షణాలు ద్వారా ప్రోటీన్ లోపాన్ని తెలుసుకోవచ్చు. అలసట, పాదాల్లో వణుకు, అధికంగా జుట్టు రాలడం, పీరియడ్స్ క్రమం తప్పడం, చర్మ సమస్యలు, ఆహారం ఆలస్యంగా జీర్ణమడం, కండరాల బలహీనత, కాళ్ల నొప్పులు, గోళ్లు పెళుసుగా మారటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉండాలంటే ప్రోటీన్ చాలా అవసరం.
 శరీరంలోని యాంటీబాడిలు పెరిగేందుకు ప్రోటీన్లు సహాయపడతాయి. ఇవి తక్కువగా ఉండే ఆరోగ్య సమస్యలు వస్తాయి. కూరగాయలు, ఆకుకూరలు, బాదం, వాల్ నట్స్, పిస్తా, చేపలు, కోడిగుడ్లలో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. చియా సీడ్స్, పప్పు ధాన్యాలను తీసుకోవటం వల్ల శరీరానికి మేలు చేస్తాయి. కాబట్టి ప్రోటీన్ లోపం ఉన్నవారు ఈ విధమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది. ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది. బలంగా కూడా ఉంటాము. కాబట్టి డైలీ కోడి గుడ్డుని తప్పకుండా తినండి. ఇది తినటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది. ప్రోటీన్లు ఉన్న ఫుడ్ ని ఎక్కువగా తీసుకోవటం మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: