కన్నీరు ఏడ్చినప్పుడే ఎందుకు వస్తుంది?... ఇదిగో షాకింగ్ నిజాలు!

lakhmi saranya
చాలామందికి ఆనందం వచ్చిన బాధ వచ్చిన కన్నీళ్లు వెంటనే వచ్చేస్తాయి. ఆనందం వచ్చినా కానీ ఆనందభాష్పాలు కింద కన్నీళ్లు వస్తాయి. మరికొన్ని సందర్భాల్లో షాక్ తో కన్నీళ్లు వస్తాయి. ప్రతి మనిషి ఏదో ఒక మానసిక స్థితిలో ఏడుస్తారు. ఈ టైంలో కన్నీళ్లు ఎందుకు వస్తాయి అనే విషయం గురించి ఎప్పుడైనా ఆలోచించారా..? కొన్ని సందర్భాల్లో సినిమాల చూస్తున్నప్పుడు భావోద్వేగా సన్నివేశాల కారణంగా ఎక్కువగా కన్నీరు వస్తుంది. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖానికి ఎక్కువగా గాలి తగిలిదే, కళ్ల నుంచి నీళ్లు వస్తాయి. ఇలా ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు వస్తుంటాయి.
 అసలు కన్నీళ్లు ఎందుకు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా కన్నీళ్లు అనేవి మానసిక స్థితికి సంబంధించినవి. ఇది మూడు రకాలుగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. మొదటిది బేసల్ పర్గం. రెండవది అకస్మాత్తుగా సంభవించే రిఫ్లెక్స్ అనే ఏడుపు. మూడవది భావోద్వేగా ప్రతిస్పందన కారణంగా వస్తుంటాయి. వీటిలో రిఫ్లెక్స్ అని పిలవబడే మరొక ఏడుపు ఉంది. ఇది నిజమైన ఏడుపు కాదు. అకస్మాత్తుగా కన్నీళ్లు సంభవిస్తాయి. అంటే ఉల్లిపాయ లేదా దుమ్ము, అకస్మాత్తుగా నొప్పి కలిగినప్పుడు ఈ రకమైన ఏడుపు వస్తుంది. నిజానికి మానవ మెదడులో ఒక లాక్రిమత గ్రంధి నుంచి ఈ ఏడుపు ఉద్భవిస్తుంది.
 ఈ గ్రంధి ప్రోటీన్, శ్లేష్మం లేదా జిడ్డుగల ఉప్పు నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇది నీళ్లు రూపంలో కళ్ల ద్వారా బయటకు వస్తాయి. ఈ ద్రవాన్ని కన్నీళ్లు అంటారు. ఆనందంగా లేదా బాధ, నిరాశ కారణంగా శరీరంలో టాక్సిన్స్ లేదా హానికరమైన రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. వాటిని బయటకి పంపించేందుకు ఏడుపు అవసరం అవుతుంది. ఎండ్రోక్రైన్ వ్యవస్థ ద్వారా సెరెబ్రమ్ నుండి హార్మోన్లు విడుదల అవుతాయి. ఈ హార్మోన్లు దుఃఖానికి కారణమైన హానికర పదార్థాలను కళ్ళ చుట్టూ ఉన్న ప్రాంతానికి తీసుకెళ్తాయి. ఇవే కన్నీటి రూపంలో బయటకు వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: