ఖాళీ కడుపుతో వర్కౌట్ చేస్తున్నారా.. ఇలా చేస్తే ఏం జరుగుతుందంటే?
అయితే కొంతమంది మాత్రమే ఆరోగ్యమే మహాభాగ్యం అని సూత్రాన్ని నమ్ముతూ.. ఫిట్నెస్ పై దృష్టి పెడుతూ ఉన్నారు అని చెప్పాలి. కాగా ఇలా ఎంతోమంది ఉదయాన్నే వ్యాయామం చేయడం చేస్తూ ఉంటారు. కానీ వ్యాయామం చేసేవారిలో కూడా ఎలా చేయాలి? ఎలాంటి నియమాలను పాటించాలి అనే విషయంపై ఇక ఎన్నో అనుమానాలు ఉంటాయి. ఇక ఇలాంటి అనుమానాలను డాక్టర్లను అడిగి ఇక సాల్వ్ చేసుకుంటూ ఉంటారు. ఇక ఇప్పుడూ ఇలాంటిదే ఒక విషయం వైరల్ గా మారిపోయింది వ్యాయామం చేయడానికి ముందు ఏమైనా తినాలా లేదంటే ఖాళీ కడుపుతోనే వ్యాయామం చేయొచ్చా లేదా అనేది అందరిలో ఉండే అనుమానం. ఒకవేళ కాళీ కడుపుతో వర్కౌట్ చేస్తే ఏదైనా చెడు జరుగుతుందా అని అందరూ అనుకుంటూ ఉంటారు.
అయితే ఈ విషయంపై వైద్య నిపుణులు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు. ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో వర్కౌట్స్ చేయడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉంటాయి అంటూ చెబుతున్నారు ఫిట్నెస్ నిపుణులు. ఖాళీ కడుపుతో వ్యాయామం చేస్తే గ్లూకోజెన్ స్థాయిలు తగ్గిపోతాయట. ఇక అంతేకాకుండా శరీరంలో పొగైన కొవ్వుల్ని శరీరం శక్తి కోసం వాడుతుందట. దీంతో కొవ్వు వేగంగా కరిగిపోయేందుకు అవకాశం ఉంటుందట అంతేకాకుండా బాడీ గ్లూకోస్ ని మరింత వేగంగా పీల్చుకుంటుందట. ఇక దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందట. గుండె ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందట. అంతేకాకుండా ఏకాగ్రత పెరిగి రోజంతా చలాకీగా ఉండేందుకు ఇలాంటి వర్కౌట్ తోడ్పడుతుంది అంటూ నిపుణులు చెబుతున్నారు.