సినిమా ఇండస్ట్రీలో... విడాకులు చాలా కామన్ అయిపోయాయి. చిన్నచిన్న కారణాలతో సినీ సెలబ్రిటీల జంటలు విడిపోతున్నాయి. ప్రేమించి పెళ్లి చేసుకోవడం... ఆ తర్వాత విడిపోవడం మనం చూస్తున్నాం. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా... మరో సినీ సెలబ్రిటీ విడాకులు తీసుకోవడం జరిగింది. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్... దంపతులు విడిపోయారు. ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది.
ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ఏ ఆర్ రెహమాన్ సతీమణి సైరా ప్రకటించడం జరిగింది. తన భర్త ఏఆర్ రహమాన్ కు విడాకులు ఇస్తున్నట్లు... సైరా వెల్లడించారు. ఏఆర్ రెహమాన్ అంటే తనకు... తమ మధ్య ఇంకా లవ్ ఉందని ఆమె వెల్లడించారు. ప్రేమతో పాటు కొన్ని సమస్యలు కూడా ఇద్దరి మధ్య విపరీతంగా పెరిగిపోయినట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమస్యలు తారస్థాయికి చేరటంతో విడాకుల వరకు తమ విషయం వెళ్లిందని సైరా వెల్లడించడం జరిగింది.
ఇద్దరం... కలిసి తీసుకున్న నిర్ణయమే ఇది అంటూ ఆమె ప్రకటించారు. విడిపోతేనే.. మంచిదని ఇద్దరం ఒక నిర్ణయానికి వచ్చామని... ఇది చాలా బాధాకరమైన విషయమని ఆమె పేర్కొన్నారు. ఈ విషయంలో అభిమానులు అందరూ తమకు సపోర్ట్ గా నిలవాలని సహకరించాలని కోరారు. ఇది ఇలా ఉండగా దాదాపు 29 సంవత్సరాలు ఏ ఆర్ రెహమాన్ దంపతులు కాపురం చేశారు.
ఈ జంటకు ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. అయితే ఈ విడాకులపై ఏఆర్ రహమాన్ సతీమణి తరపు న్యాయవాది కూడా మాట్లాడారు. ఏఆర్ రెహమాన్ దంపతుల మధ్య కొన్ని రోజులుగా... విభేదాలు ఉన్నాయని... అందుకే వారిద్దరు విడాకులు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇది ఇలా ఉండగా.... ఈ విడాకుల అంశంపై... ఏఆర్ రెహమాన్ ఇంకా స్పందించలేదు. దీంతో విడాకుల అంశం ఆయనకు తెలుసా? లేక బలవంతంగా ఆయనకు విడాకులు ఇచ్చిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది.