పుష్ప తో పోటీ పడుంటే గేమ్ ఛేంజర్ గతి ఏమయ్యేనో..?

murali krishna
ప్రస్తుతం ఎక్కడ చూసిన పుష్ప ఫీవర్ నడుస్తోంది.అంతలా పుష్ప విధ్వంసం సృష్టిస్తుంది..పుష్ప క్రియేట్ చేసిన స్వాగ్ అలాంటిది.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.. రీసెంట్ గా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కోసం బీహార్ లో భారీ ఈవెంట్ చేసారు.. ఈవెంట్ లో అల్లు అర్జున్ ఫ్యాన్స్ తండోపతండాలుగా వచ్చారు.. రిలీజ్ అయిన ట్రైలర్ కు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ లభిస్తుంది..పుష్ప 2 సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమాతో అల్లు అర్జున్ విధ్వంసం చూస్తారు అంటూ మేకర్స్ పుష్ప రాజ్ పై ఫుల్ కాన్ఫిడెంట్ గా వున్నారు..ఏకంగా రిలీజ్ కి ముందే 1000 కోట్ల బిజినెస్ చేసిందంటే ప్రపంచ వ్యాప్తంగా పుష్ప మేనియా ఎలా వుందో చెప్పొచ్చు..అయితే ఈ సినిమా కంటే ముందే శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ ఛేంజర్ మూవీ  టీజర్ లాంచ్ కూడా నార్త్ లోనే జరిగింది అయితే పుష్ప 2 కి వచ్చినంత హైప్ గేమ్ చేంజర్ ఈవెంట్ కి రాలేదనే చెప్పాలి. 

అయితే గేమ్ చేంజర్ విషయంలో జరిగిన పొరపాటు ఏమిటంటే ఆ ఈవెంట్ ని పరిమిత సీటింగ్ ఉన్న ఇండోర్ థియేటర్లో చేయడం జరిగింది... నిజానికి నిర్మాత దిల్ రాజు ప్రమోషన్స్ విషయంలో ఎక్కడా వెనుకాడరు.. అయితే ఈ ఈవెంట్ ఇండోర్ లో ప్లాన్ చేసి పెద్ద తప్పు చేశారు.ఎందుకంటే పరిమిత సీటింగు వున్న ఇండోర్ థియేటర్ కావడంతో ఆ ఈవెంట్ అనుకున్నంత రీచ్ సాధించలేకపోయింది. దాంతో ఇప్పుడు అందరూ పుష్ప 2 ఈవెంట్ తో గేమ్ చేంజ్ ని ఈవెంట్ ని కంపేర్ చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు నెలరోజులు తేడాతో విడుదలకు సిద్ధంగా ఉండటంతో గేమ్ ఛేంజర్ కాస్త సేవ్ అయిందని.. లేకుంటే పుష్ప మేనియా కి గేమ్ చేంజర్ గతి ఏమయ్యేనో అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.డిసెంబర్ 5న విడుదలకు సిద్ధమైన పుష్ప సినిమాకు ప్రేక్షకులలో పిచ్చ క్రేజ్ వుంది..అలాగే రిలీజ్ రోజు బెనిఫిట్ షో టికెట్లు ఎలా అమ్మాలని దానిపై మేకర్స్  సరికొత్త ప్లాన్స్ వేస్తున్నట్లు సమాచారం.. కానీ గేమ్ ఛేంజర్ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతుంది. డైరెక్టర్ శంకర్ మీద ఇండియన్ 2 ప్రభావం పడటం, అలాగే సినిమా విడుదల విపరీతమైన జాప్యానికి గురికావడంతో ఆ సినిమాకి హైప్ తగ్గిందని న్యూస్ బాగా వైరల్ అవుతుంది...

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: