వామ్మో.. డాన్స్ చేస్తూ జనరేటర్ లో ఇరుక్కుంది.. ఇలాంటి మరణాన్ని ఎప్పుడూ చూసి ఉండరు?

praveen
మనుషుల జీవితాలు దేవుడు చేతిలో కీలుబొమ్మలు అని అంటూ ఉంటారు ఎంతోమంది పెద్దలు. అయితే వెలుగులోకి వచ్చే కొన్ని కొన్ని ఘటనలు చూసినప్పుడు ఇది నిజమే అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పటివరకు ఎంతో సంతోషంగా గడిపిన వారు క్షణకాల వ్యవధిలోనే ప్రాణాలను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. ఇలాంటి తరహా ఘటనలు ఈ మధ్యకాలంలో తరచూ వెలుగులోకి వస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 అప్పుడు వరకు కుటుంబ సభ్యులతో బంధుమిత్రులతో ఎంతో సంతోషంగా గడిపిన వారు.. కొన్ని అనూహ్యమైన ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోతున్నారు. చాలామంది ఈ మధ్యకాలంలో సడన్ హార్ట్ ఎటాక్ల కారణంగా ఉన్నచోటే కుప్ప కూలిపోయి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఇక్కడ ఇలాగే ఓ ఘటన జరిగింది. కానీ సడన్ హార్ట్ ఎటాక్ కాదు. కానీ ఊహించని ఘటనతో  ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన తీరు ప్రతి ఒక్కరిని కూడా అవాక్కయ్యేలా చేస్తుంది. రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో ఈ హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

 కుందల్ గ్రామానికి చెందిన మాఫీ దేవి అనే మహిళ జన్మాష్టమి సందర్భంగా గ్రామంలోని ఇతర మహిళలతో కలిసి శ్రీకృష్ణుడి విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు చేరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలోనే అక్కడున్న మహిళలందరూ పాటలకు అనుగుణంగా నృత్యాలు చేయడం మొదలుపెట్టారు. మాఫీ దేవి కూడా అందరితో కలిసి ఎంతో సంతోషంగా డాన్స్ చేస్తుండగా.. జనరేటర్ను ఢీకొట్టింది. దీంతో చున్నీ జనరేటర్ లో ఇరుక్కుపోయింది. దీంతో ఆమె తల కూడా జనరేటర్ లోకి వెళ్లి ఒక్కసారిగా పగిలిపోయింది. ఇక ఈ ప్రమాదంతో అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాద సమయంలో సదరు మహిళ గట్టిగా అరవడం వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు. అయితే ఈ ఘటనతో ఒక్కసారిగా అందరూ చెల్లాచెదురుగా పారిపోయారు. అనంతరం జనరేటర్ యజమాని పరారీలో ఉన్నట్లు సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: