ఒకేసారి ఉదయించిన ఏడు సూర్యులు. ఇలాంటి అద్భుతాన్ని ఎప్పుడు చూసుండరు?
ఇంకేముంది ఈ వీడియో వైరల్ గా మారగా.. ఆ మహిళను ఆశ్చర్యానికి గురిచేసిన ఆ విషయం నేటిజన్స్ అందరిని కూడా విస్మయానికి గురిచేస్తుంది అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీడియోలో కనిపిస్తున్న దృశ్యం అలాంటిది. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే ఉదయం సమయంలో సూర్యుడు ఉదయించడం.. సాయంత్రం సమయంలో సూర్యుడు అస్తమించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కూడా ఉదయం సమయంలో సూర్యుడు ఉదయించాడు. కానీ ఒక్క సూర్యుడు కాదు ఏకంగా ఏడు సూర్యులు ఒకేసారి ఉదయించారు. ఏడు సూర్యులు ఉదయించడమేంటి వినడానికే విచిత్రంగా ఉంది అని అనుకుంటున్నారు కదా.
నమ్మశక్యం కానీ ఈ అద్భుత దృశ్యం చైనాలో కనిపించింది. చెంగ్డు నగరంలో ఆకాశంలో ఆకస్మాత్తుగా ఏడు సూర్యులు కనిపించారు. అయితే ఇది గమనించిన ఒక మహిళ ఇక సోషల్ మీడియాలో వీడియో తీసి పెట్టడంతో వైరల్ గా మారిపోయింది. వాంగ్ అనే మహిళ ఆసుపత్రికి కిటికీలోనుంచి ఇక ఇదంతా షూట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే విశ్వంలో ఒకే సూర్యుడు ఉంటే ఏడు సూర్యులు కనిపించడం వెనక కారణం ఏంటి అని ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఏడు సూర్యులను కనిపించడానికి వెనుక ఏకంగా సైన్స్ కారణం అంటూ చెబుతున్నారు. సైన్స్ పరిభాషలో దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారట. విండో గ్లాస్ 7 కొరలు ఉన్నందున కాంతి వక్రీభవనం తర్వాత ప్రతీపొర సూర్యుని నీడను సృష్టిస్తుంది. దీనిని ఆప్టికల్ ఇల్యూషన్ అని కూడా అంటారు. ఆకాశంలో ఏకకాలంలో ఏడు సూర్యులు కనిపించడానికి కారణం ఇదే అంటూ సోషల్ మీడియాలో ఎంతోమంది నిపుణులు కామెంట్లు చేస్తున్నారు.