ఏళ్లు గడిచినా ఆ అభిమానికి అండగా ఎన్టీఆర్.. నిజంగా నువ్వు దేవుడివయ్యా..!!

murali krishna
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమా మరో నెలలో రిలీజ్ కానుంది. ఈ మాస్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాపై పాన్ ఇండియా రేంజ్‍లో చాలా క్రేజ్ ఉంది. కొరటాల శివ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. రిలీజ్ సమీపిస్తుండటంతో దేవర నుంచి ట్రైలర్ ఎప్పుడొస్తుందా అనే క్యూరియాసిటీ పెరిగిపోతోంది.ఈ నేపథ్యంలో సౌత్‌లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఒకరు యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఇప్పుడు పాన్ ఇండియాలోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన సినిమాలు విడుదలకు ముందే ట్రెండ్ అవుతాయి.అయితే ఆయన ఎంత మంచి నటుడో.. అంతే మంచి వ్యక్తిత్వం గల మనిషి కూడా.ఇదిలావుండగా  జూనియర్‌ ఎన్టీఆర్‌ నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో తన నటనకు గాను ఆస్కార్‌ అవార్డు కూడా వరించింది. ఆయన కేవలం నటుడిగానే కాదు.. ఆయన మంచి మనసుని ఎన్నోసార్లు రుజువు చేసుకున్నారు కూడా. తన అభిమాని చనిపోయి పదకొండేళ్లయినా.. ఇప్పటికీ అభిమాని కుటుంబాన్ని ఎన్టీఆర్‌ ఆదుకుంటున్నాడు. 2013లో ఎన్టీఆర్‌ నటించిన సినిమా ‘బాద్‌ షా’ మ్యూజిక్‌ లాంచ్‌ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీగా అభిమానులు తరలివచ్చారు. భారీగా తరలివచ్చిన జనం తొక్కిసలాటలో ఎన్టీఆర్‌ అభిమాని అయిన రాజేంద్ర ప్రసాద్‌ అలియాస్‌ రాజు అనే అభిమాని మృతి చెందాడు. దీంతో జూనియర్‌ ఎన్టీఆర్‌ తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో తారక్‌ అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు. ఈ ఘటన జరిగి పదకొండేళ్లయినా.. ఆ కుటుంబ బాధ్యతను తారక్‌ చూస్తున్నాడు.ఇదిలావుండగా ఇప్పటికే దేవర చిత్రం నుంచి వచ్చిన రెండు పాటలు పాన్ ఇండియా రేంజ్‍లో పాపులర్ అయ్యాయి. మరిన్ని అప్‍డేట్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ సెప్టెంబర్ 27న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది. అన్ని భాషల కోసం ప్రమోషన్లను జోరుగా చేసేలా మూవీ టీమ్ పక్కా ప్లాన్ వేస్తోందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: