పార్లమెంట్ ఫైట్: అమరావతికే ఆకర్షణగా ఔటర్ రింగ్ రోడ్.. సాధ్యమేనా..?

FARMANULLA SHAIK
 * అమరావతికి ఆక్సిజన్ అందించే పనుల్లో బాబు

 * రాష్ట్రాభివృద్ధి కోసం కూటమి ఎంపీలు కథం తొక్కాల్సిందే..!

 * నలభై మండలాలను రౌండప్ చేస్తున్న ఓఆర్ఆర్

 * మెగాసిటీని తలపించనున్న ఓఆర్ఆర్ నిర్మాణం ?

(అమరావతి-ఇండియా హెరాల్డ్ ) : ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2న రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకంగా మారింది రాజధాని అంశం.విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలని ప్రపంచంలోనే మెరుగైనా నగరాల్లో ఒకటిగా రూపొందించాలని ఏంతో తపన పడ్డారు కానీ విభజన కారణంగా ఏపీ ఆర్ధిక పరిస్థితి ఏమి బాగోలేదు. అమరావతి అభివృద్దే లక్ష్యంగా పెట్టుకొని ప్రణాళికలు వేసుకున్న వాటిలో అతి ముఖ్యమైనది అమరావతి చుట్టూ నిర్మించాలనుకున్న ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ప్రాజెక్ట్ కోసం చంద్రబాబు ఏంతో కష్టపడి కేంద్రం నుంచి అనుమతులు సాధించి ప్రాజెక్ట్ స్టార్ట్ చేద్దామనుకునే సరికి రాష్ట్రంలో ఎన్నికలు రావడం ప్రభుత్వం మారడం జరిగిపోయాయి.గత ప్రభుత్వ పాలనలో అమరావతి అంశమే మూలన పెట్టి కేవలం సంక్షమానికే అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటినుండి ఈ ఓఆర్ఆర్ ప్రాజెక్ట్ పట్టించుకునే నాథుడే లేకపోయారు.
ప్రస్తుతం ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక గాడి తప్పిన రాష్ట్ర పాలనను అదుపు చేస్తూ ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి రెంటిని బాలన్స్ చేస్తూ దూసుకుపోవడంలో ప్రణాళికలు చేస్తున్నారు సీఎం చంద్రబాబు.దాంట్లో భాగంగానే ఓఆర్ఆర్ స్టార్ట్ చేసి దాని పూర్తి చేయడం పై వ్యూహన్ని పన్నుతున్నారు.ఈ ప్రాజెక్ట్‌తో పలు నగరాల మధ్య దూరం తగ్గి కనెక్టివిటీ పెరుగుతంది.ఈ ప్రాజెక్ట్ కనక పూర్తి అయితే అమరావతి పక్కనే ఉన్న విజయవాడ, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి వంటి పట్టణాలు కలిసిపోయి ఓ మెగాసిటీగా మారిపోయే అవకాశముంది. అయితే ఇటీవల బాబు పీఎం మోదీని కలిసి ప్రాజెక్ట్ విషయంపై చర్చించడంతో పీఎం సానుకూలంగా స్పందించారు.

అమరావతి చుట్టూ కృష్ణా, గుంటూరు జిల్లా గుండా 189 కిలోమీటర్ల పొడవుతో ఔటర్ రింగ్ రోడ్ ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మించడానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈప్రాజెక్ట్ మొత్తం పూర్తి చేయడానికి రూ.25 వేల కోట్ల ఖర్చు అవుతుందని అంచనావేశారు. భూసేకరణ ఖర్చుతో సహా మొత్తాన్ని కేంద్రప్రభుత్వమే భరిస్తుందని రాజమండ్రి ఎంపీ, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఎక్స్‌ వేదికగా వెల్లడించారు. ఈమేరకు నిధుల కేటాయింపు కూడా రానున్న బడ్జెట్‌లో జరగనుందని తెలిపారు.కూటమిలో భాగంగా మొత్తం 21 ఎంపీ సీట్లు కైవసం చేసుకొని లోకసభలో గట్టిగ రాష్ట్రం కోసం నిలదీసి మాట్లాడే విధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.బడ్జెట్ లో పాతిక వేల కోట్లు కేటాయించడమే కాదు దాని విడుదలకు అలాగే సరిపోకపోతే మరికొంత బడ్జెట్ కేటాయింపుపై ఎంపీలు గట్టిగ కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరిని కలిసిన చంద్రబాబు ప్రస్తుతం ఏపీలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా భూ సేకరణ ఖర్చు కూడా కేంద్రమే భరించాలని అన్నారు.చంద్రబాబు ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటం విశేషం. 2018లో ఈ ప్రాజెక్టును మొదటిసారి ప్రతిపాదించినప్పుడు అంచనా వ్యయం 17వేల కోట్లు. ఐదేళ్లుగా దీన్ని నిర్లక్ష్యం చేయటం వల్ల ఇప్పుడు అంచనా వ్యయం పెరిగి అది కాస్త 25వేల కోట్లకు చేరుకున్నదని తెలుస్తుంది. ఏదేమైనా మన ఎంపీలు దీనికోసం పార్లమెంట్లో పోరాడైన సరే నిధులు తెప్పించుకొని చంద్రబాబు లక్ష్యంగా ఉన్న అమరావతి అభివృద్ధికి తమ వంతు కృషి అందిస్తారో లేదొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: