పార్లమెంట్ ఫైట్ : వైసీపీ ఎంపీల పాత్ర అంతంత మాత్రమేనా..?

murali krishna
* పార్లమెంట్ లో రాష్ట్ర సమస్యల గోడు వినిపించనున్న కూటమి ప్రభుత్వం
* ఈ సారి రాష్ట్ర కీలక సమస్యలపై సుదీర్ఘ చర్చ
* పార్లమెంట్ లో ఈ సారి వైసీపీది ప్రేక్షక పాత్రే
*  మైక్ ఇచ్చే ఛాన్స్ అయినా ఉంటుందో లేదో ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీకి గడ్డు కాలం నడుస్తుంది.ఈ సారి జరిగిన సార్వత్రిక ఎన్నికలలో టీడీపీ ,బీజేపీ ,జనసేన కూటమి ప్రభంజనం సృష్టించింది.ఏకంగా 164 అసెంబ్లీ సీట్లు మరియు 21 పార్లమెంట్ సీట్లు సాధించి ప్రభంజనం సృష్టించింది.వైసీపీ పార్టీ మాత్రం కేవలం 11 అసెంబ్లీ సీట్లు మరియు 4 ఎంపీ సీట్లు మాత్రమే గెలిచి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.గత ఎన్నికలలో 151 సాధించిన వైసీపీ పార్టీకి ఇంతటి ఘోరమైన ఓటమి దక్కుతుందని ఎవ్వరు కూడా ఊహించలేదు.గత కాబినెట్ లో వున్న మంత్రులంతా ఓటమి పాలు కావడం విశేషం.గతంలో లాగా వైసీపీ తిరిగి పుంజుకోవాలంటే చాలా కష్టపడాల్సి వుంది.గత ఎన్నికలలో ప్రత్యేక హోదా సాధనే మా ద్యేయం అంటూ జగన్ పార్టీ ప్రజలలో బలంగా  వినిపించింది.తాము అధికారంలోకి వస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించి తీరుతామని హామీని ఇచ్చారు.దీనితో ప్రజలు వైసీపీకి ఏకంగా 22 మంది ఎంపీలను ఇచ్చారు.అయితే వైసీపీ హయాంలో ప్రత్యేక హోదా కాదు కదా కనీసం విభజన సమస్యలు సైతం పరిస్కారం కాలేదు.దీనితో రాష్ట్ర భవిష్యత్ మార్పు దిశగా ప్రజలు అడుగు వేశారు.
కేంద్రంలో ,రాష్ట్రములో హవా సాగిస్తున్న ఎన్డిఏ కూటమికి పూర్తి మద్దతుగా నిలిచారు.అయితే కేంద్రంలో ఎన్డిఏ కూటమికి ఇండియా కూటమి గట్టి పోటీని ఇచ్చింది.మోడీకి స్పష్టమైన మెజారిటీ లేకపోవడంతో ఏపీ ,బీహార్ మద్దతు తప్పనిసరి అయింది.ఇరు రాష్ట్ర ముఖ్యమంత్రుల మద్దతుతో మోడీ మరోసారి పీఎం అయ్యారు .ఎన్నో ఏళ్ల తరువాత మళ్ళీ ఏపీకి కేంద్రంలో ప్రత్యేక స్తానం దక్కింది.ఇదే అదునుగా భావించి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలను కేంద్రం నుంచి వచ్చేలా టీడీపీ అధినేత చంద్రబాబు పావులు కదుపుతున్నారు.జులై 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు మొదలు కానున్నాయి..దీనితో రాష్ట్ర సమస్యలపై గట్టిగ చర్చించాలని తమ ఎంపీ అభ్యర్థులకు ఆదేశాలు ఇచ్చారు.అయితే గతంలో టీడీపీ ఎంపిలను అవమానించిన వైసీపీ ఎంపీల పాత్ర మాత్రం ఈసారి అంతంత మాత్రమే అని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: