ఏపీ భవిష్యత్తు : కేంద్రం ముందు పవన్, బాబు ఈ డిమాండ్లు పెట్టాల్సిందే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మంచి అవకాశం వచ్చింది. కేంద్రంలో చక్రం తిప్పే.. అవకాశం చంద్రబాబు నాయుడు కు వచ్చిన నేపథ్యంలో... ఏపీకి న్యాయం జరిగేలా ఇప్పటినుంచే గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేయాలి. కేంద్రంలో 272 స్థానాలు వస్తేనే అధికారంలోకి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే బిజెపి మాత్రం... 244 సీట్ల వరకు మాత్రమే రాగలిగింది. దీంతో...తెలుగుదేశం, జేడీయు లాంటి ప్రాంతీయ పార్టీల అవసరం మోడీ ప్రభుత్వానికి వచ్చింది.
అయితే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు...చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే... ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన చంద్రబాబు నాయుడు... ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అయితే... బిజెపి పార్టీని ఎప్పుడు కూడా నమ్మలేము. కాబట్టి కీలక శాఖలు అడిగే దిశగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అడుగులు వేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో భారీ నీటిపారుదల శాఖ, రైల్వే శాఖ, ఇతర కొన్ని సహాయ మంత్రి పదవులు కూడా చంద్రబాబు అడగాలి.
ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు పెండింగ్లో ఉంది. భారీ నీటి పారుదల శాఖ మంత్రి పదవి టిడిపి దగ్గర ఉంటే... పెండింగ్ నిధులు అలాగే అదనపు నిధులను కూడా రిలీజ్ చేయించుకునే ఛాన్స్ ఉంటుంది. అలాగే రైల్వే శాఖ ఏపీకి ఇస్తే... రైల్వే జోన్లలో డెవలప్మెంట్, కొత్త జోన్ల ఎంపిక, మారుమూల గ్రామాలకు కూడా రైల్వే లైన్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు... రైల్వే శాఖలో చాలా డెవలప్మెంట్ టిడిపి చేసుకోవచ్చు.
ఇటు అమరావతి విషయంలో కూడా... మోడీ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకురావచ్చు. రాజధాని నిర్మాణం చేపట్టేలా.. కేంద్ర సహాయాన్ని నిత్యం చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ తీసుకోవాల్సి ఉంటుంది. దానికి తగ్గట్టుగా నిధులు రాబట్టగలగాలి. ముఖ్యంగా ఏపీలో ఐటీ శాఖను డెవలప్మెంట్ చేసే దిశగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ అడుగులు వేయాలి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఉన్న.. లెక్కలను తేల్చేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలి. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన నిధులు లేదా ఆస్తులు తదితర విషయాలను కేంద్రం ద్వారా పరిష్కరించుకోవాలి. ఇలా ఒకటి కాదు వందకు పైగా సమస్యలను పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు తీర్చాల్సిందే.